50 ఏళ్ల వయసులో నాలుగోసారి తండ్రైన ప్రభుదేవ.. ఎన్నో భార్యతో అంటే..

- Advertisement -

ఇండియన్ మైకెల్ జాక్సన్‌గా పేరు తెచ్చుకున్న కొరియోగ్రాఫ‌ర్ ,న‌టుడు ,ద‌ర్శ‌కుడు ప్రభుదేవా మ‌రోసారి తండ్రి అయ్యాడ‌ట‌. 50ఏళ్ళ వ‌య‌స్సులో ముచ్చ‌ట‌గా మూడో సారి తండ్రిగా ప్ర‌మోష‌న్ పొందాడంటూ ఓ వార్త కోలీవుడ్ లో వైర‌ల్ అవుతుంది. ప్ర‌భుదేవా రెండో భార్య హిమానీ ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింద‌ని, సుంద‌రం మాస్ట‌ర్ ఇంటా ఆనందాలు అంబ‌రాన్నంటాయి అనేది సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. 1995 లో ప్ర‌భుదేవా రామ‌ల‌త‌ను పెళ్ళి చేసుకున్నాడు. ప్ర‌భుదేవా కోసం అమె హిందువుగా మ‌తం మార్చుకుంది. వీరికి పిల్ల‌లు కూడా వున్నారు.

ప్రభుదేవ
ప్రభుదేవ

ప్రభుదేవా మొదటి భార్య రామలతకు 2011లో విడాకులు ఇచ్చేశారు . వీరికి ముగ్గురు సంతానం . కాగ పెద్దబ్బాయి క్యాన్సర్ తో మరణించాడు . ఆ తర్వాత నయనతారతో డేటింగ్ అంటూ ప్రభుదేవా భార్య నుంచి విడాకులు కోరుకున్నారు . అప్పట్లో ఈ విషయం ఎంత హాట్ టాపిక్ గా ట్రెండ్ అయ్యిందో మనకు తెలిసిందే. కాగా ఆ తర్వాత నయనతారతో కూడా ప్రభుదేవా బ్రేకప్ చెప్పేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ గా ఉన్న ప్రభుదేవా 2020 లో డాక్టర్ హిమాసింగ్ ను నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు . రీసెంట్ గానే వీళ్ళ వివాహానికి సంబంధించిన న్యూస్ వైరల్ గా మారింది .

prabhu deva

ప్రభుదేవా రెండో భార్య గురించి తెలిసింది చాలా తక్కువ . ప్రభుదేవా 50వ బర్తడేను హిమాని సింగ్ ప్రత్యేకంగా జరిపారు. దీంతో సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ గా మారింది. అంతేకాదు అప్పుడే హిమానింగ్ సింగ్ వెలుగులోకి వచ్చింది. అయితే హిమాని సింగ్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారట . ఇదే న్యూస్ ఇప్పుడు చిత్ర వర్గాలల్లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. అయితే దీనిపై ఎటువంటి అఫీషియల్ ప్రకటన లేదు కానీ ప్రభుదేవా 50 ఏళ్ల వయసులో తండ్రి అయ్యాడు అన్న వార్త ఓ రేంజ్ లో హార్ట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది..!! దీనిపై ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో చూడకూడనివి చూస్తున్నాం ..విన కూడనివి వింటున్నాం అంటూ జనాలు ఓ రేంజ్ లో రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు .

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here