Prabhas : ఇండియా లోనే బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ పేర్లని తీస్తే అందులో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా లో నెంబర్ 1 బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆయనే అనడం లో కూడా ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే బాలీవుడ్ హీరోలకు కేవలం హిందీ మార్కెట్ మాత్రమే ఉంటుంది.

కానీ ప్రభాస్ కి హిందీ మార్కెట్ తో పాటుగా తెలుగు , కన్నడ, తమిళం మరియు మలయాళం మార్కెట్ కూడా ఉంటుంది. బాహుబలి సిరీస్ తర్వాత ఆయన స్టార్ ఇమేజి ఆ స్థాయిలో పెరిగింది. ఆ సిరీస్ తర్వాత ప్రభాస్ చేసిన ప్రతీ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ఫ్లాప్స్ గా నిలుస్తూ వచ్చాయి. కానీ ఆ ఫ్లాప్ చిత్రాలకు వచ్చిన కలెక్షన్స్ ఇతర హీరోల సూపర్ హిట్ రేంజ్ కంటే ఎక్కువ వసూళ్లను రాబట్టాయి.

ఫ్లాప్ సినిమాలకే ఆ స్థాయి వసూళ్లు వస్తున్నాయి, ఇక హిట్ సినిమాకి ఇప్పుడు ఏ రేంజ్ లో వస్తాయో అని ఇప్పటి నుండే లెక్కలు వేసుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ కి సంబంధించిన ఒక లేటెస్ట్ న్యూస్ ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా ని ఊపేస్తోంది. అదేమిటంటే ప్రభాస్ రీసెంట్ గానే హైదరాబాద్ సిటీ కి కాస్త దూరం గా 120 కోట్ల రూపాయిలు విలువ చేసే భూములను కొనుగోలు చేసాడట. ఈ భూమిలో 200 కోట్ల రూపాయిల విలువ చేసే ఇంటిని నిర్మించబోతున్నాడట త్వరలో.

ఎప్పుడూ లేనిది ప్రభాస్ ఎందుకు ఈ ఇంటిని నిర్మించడానికి ఇంత తొందర పడుతున్నాడు అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. దీనికి ఫ్యాన్స్ ప్రభాస్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు అని, కాబొయ్యే భార్య కి బహుమతి ఇవ్వడం కోసమే ప్రభాస్ ఈ కొంత ఇంటిని నిర్మిస్తున్నాడు అంటూ ఎవరికీ వారు స్టోరీలు అల్లేస్తున్నారు, ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి.