ఆర్ఆర్ఆర్ మూవీ తో వరల్డ్ వైడ్ రికగ్నిషన్ సాధించిన ఎన్టీఆర్ ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్టుతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే తారక్ ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు సంబంధించిన వారి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకుంటాడట. అతను ప్రొఫెషనల్ లైఫ్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో పర్సనల్ లైఫ్ కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇస్తాడు. అంతేకాదు తనతో కలిసి వర్క్ చేసే ఆర్టిస్టుల పట్ల ఎన్టీఆర్ ఎంతో స్నేహపూరితంగా ఉంటారు.
ఎవరు కష్టాల్లో ఉన్న ఎన్టీఆర్ వాళ్ళను ఓదార్చడంలో ముందు ఉంటారట. ఈ విషయాన్ని తారక్ తో ఎన్నో సినిమాలు నటించిన ప్రభాస్ శీను వెల్లడించారు. తన జీవితంలో అనుకోని ఒక సంఘటన జరిగినప్పుడు తనకోసం నిలబడిన విధానాన్ని ఆయన అందరితో పంచుకున్నారు.ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రభాస్ శీను తారక్ గురించి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు వైరల్ అయ్యాయి..
ప్రభాస్ శీను భార్యకు అబార్షన్ అయిన సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అతనికి కాల్ చేసి టెన్షన్ పడకు అని ఓదార్చారట. యమదొంగ సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుందని.. అప్పట్లో తనకు ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేదని ప్రభాస్ శీను వెల్లడించారు. ఇలాంటివి లైఫ్ లో జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ పుట్టే పిల్లవాడు నాలాంటి వాడు పుడతాడు లే అని తారక్ అతనికి ధైర్యం చెప్పాడట.
అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలామందికి ప్రేమ ఉంటుంది అని ప్రభాస్ శీను పేర్కొన్నారు. సెట్లో ఎంతో సరదాగా అందరితో కలిసిపోయే ఎన్టీఆర్ ఎప్పుడు కూడా తాను ఒక పెద్ద హీరోని అన్న బిల్డప్ ఇచ్చింది లేదట. అతని సర్కిల్ లో ఉన్న వాళ్లకు మాత్రమే ఎన్టీఆర్ గొప్పతనం తెలుస్తుందని ప్రభాస్ అన్నారు. అంతేకాదు ఎన్టీఆర్ లో ఒక గొప్ప చెఫ్ కూడా దాగి ఉన్నారట.. ఎన్టీఆర్ గురించి ప్రభాస్ శీను వెల్లడించిన విషయాలు ఫాన్స్ కు ఎంతో ఆనందం కలిగిస్తున్నాయి.