యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్’ చిత్రం కోసం ఫ్యాన్స్ తో పాటుగా ప్రేక్షకులు కూడా ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. సరైన హీరోకి సరైన డైరెక్టర్ తో సినిమా పడితే ఎలా ఉంటుందో చెప్పడానికి ఉదాహరణే ‘సలార్’. KGF సిరీస్ లాంటి వెండితెర మహా అద్భుతం తర్వాత, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న సినిమా కావడం తో ఈ ప్రాజెక్ట్ ప్రకటించిన రోజు నుండే అభిమానుల్లో అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఫస్ట్ లుక్ తర్వాత ఆ అంచనాలు తారాస్థాయికి చేరుకుంది.

సెప్టెంబర్ 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న ఈ సినిమా టీజర్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అలాంటి అభిమానుల కోసం ఈ నెల 6 వ తేదీన ఈ టీజర్ ని విడుదల చెయ్యబోతున్నట్టుగా రెండు రోజుల క్రితం అధికారికంగా ప్రకటించారు, ఇక కాసేపటి క్రితమే విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము.

అందరూ ఊహించినట్టుగానే ఈ టీజర్ ప్రారంభం నుండే ప్రశాంత్ నీల్ మార్కు తో ఉంది. టీజర్ ప్రారంభం లో ఒక సమూహం ముసలి వాడి పై గన్స్ ని గురి పెడుతారు. అప్పుడు ఆయన డైలాగ్ చెప్తూ ‘టైగర్ , చీతా, ఎలిఫెంట్ అన్నీ అత్యంత ప్రమాదకరమైనవి..కానీ జురాసిక్ పార్క్ లో మాత్రం కాదు, ఎందుకంటే ఆ జురాసిక్ పార్క్ లో డైనోసర్ ఉంది’ అంటూ యాక్షన్ షాట్స్ లో ప్రభాస్ ని చూపిస్తారు. టీజర్ చాలా సింపుల్ గా పవర్ ఫుల్ గా అనిపించింది.

ప్రశాంత్ నీల్ తన సినిమాల్లో కలర్ థీమ్ ని బ్లాక్ గా ఉంచుతాడు, ఈ సినిమాలో కూడా అలాగే ఉంచాడు. కానీ ఒకే ఒక్క నిరాశ ఏమిటంటే, టీజర్ నిడివి చాలా తక్కువ సేపు ఉండడమే. చూస్తునంత సేపటి లోపే టీజర్ ఐపోయినట్టుగా అనిపిస్తుంది, ఇదొక్కటే నిరాశకి గురి చేసిన విషయం. ఈ టీజర్ లో ప్రభాస్ తో పాటుగా , పృథ్వీ రాజ్ సుకుమారన్ ని కూడా చూపించారు.