Salaar Collections : ప్రభాస్ హీరో గా నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’ నిన్న ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడం తో ఇండియా లో ఉన్న ఒక్క రికార్డు కూడా మిగలదని అనుకున్నారు అందరూ. కానీ ఓపెనింగ్స్ ఆ రేంజ్ లో మాత్రం రాలేదు.
ఒక్క ఓవర్సీస్ మరియు నైజాం ప్రాంతం లో ఒక్కటే టాక్ మరియు కాంబినేషన్ కి తగ్గ ఓపెనింగ్ వచ్చింది. మిగిలిన అన్నీ ప్రాంతాలలో యావరేజి ఓపెనింగ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఈ చిత్రానికి చాలా ప్రాంతాలలో బయ్యర్స్ షాక్ కి గురి అయ్యే ఓపెనింగ్ ని రాబట్టింది. వెస్ట్ గోదావరి జిల్లాలో 2 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టిన ఈ చిత్రం, కృష్ణ జిల్లాలో కేవలం రెండు కోట్ల రూపాయల షేర్ ని మాత్రమే రాబట్టింది.
అలాగే ఉత్తరాంధ్ర ప్రాంతం లో కూడా ఈ సినిమా కేవలం 4 కోట్ల రూపాయిల షేర్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ప్రతీ సెంటర్ లో #RRR రికార్డుని కొడుతోంది అనుకున్న ఈ చిత్రం, చివరికి మామూలు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల రేంజ్ లోనే వసూళ్లను రాబట్టడం అందరినీ షాక్ కి గురి చేసింది. కానీ నైజాం ప్రాంతం లో మాత్రం ఈ సినిమాకి 22 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ప్రీమియర్స్ నుండి 26 లక్షల డాలర్లను రాబట్టింది.
ఇక బాలీవుడ్ లో ఈ సినిమాకి కేవలం 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయట. ఇక్కడ ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టాలి. కానీ ఇదే ట్రెండ్ కొనసాగితే బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యం అని అంటున్నారు. ఓవరాల్ గా మొదటి రోజు ఈ చిత్రానికి 140 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చింది. ఆ కాంబినేషన్ కి ఇది తక్కువ ఓపెనింగ్ అనే చెప్పొచ్చు. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి, అంత దూరం వెళ్తుందో లేదో చూద్దాం.