Prabhas Marriage : ఎంత మోసం.. ప్రభాస్ నీకిది న్యాయమా..?? చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా.!?: టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ప్రభాస్ కూడా ఒకరు.. ప్రభాస్ పెళ్లి గురించి నిత్యం తరచూ ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.. ఛాన్స్ దొరికిన ప్రతిసారి ప్రభాస్ గురించి ఎవరో ఒకరు ఏదో ఒక రూమర్ లేపుతున్నారు.. అది కాస్త ఒక వారం రోజులపాటు వైరల్ అవుతుంది.. ఎందుకంటే Prabhas Marriage కోసం పాన్ ఇండియా ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు..!

ప్రభాస్ అనుష్క ప్రేమించుకుంటున్నారని.. త్వరలోనే వాళ్ల పెళ్లి జరుగుతుంది అంటూ ఆ మధ్య సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.. దీనిపై వాళ్ళిద్దరూ క్లారిటీ ఇచ్చారు. అక్కడితో ప్రభాస్ పెళ్లి టాపిక్ ముగిసిపోయిందని అంతా అనుకున్నారు. ఈలోపు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా టేకప్ చేయడం.. ఆ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్ గా నటించడంతో.. ప్రభాస్ కృతి సనన్ ఇద్దరూ లవ్ లో ఉన్నారంటూ బాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరిగింది..
ఈ సినిమా ట్రైలర్ రోజు ప్రభాస్ పై కృతి సనన్ ఎంత కేరింగ్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ప్రభాస్ కూడా ఏ మాత్రం తగ్గకుండా కృతి సనన్ చేయి పట్టుకొని అందరి ముందు అడుగులు వేయడంతో వీళ్ళిద్దరూ ప్రేమ లో ఉన్నారంటూ కన్ఫామ్ చేశారు ఇన్ డైరెక్టుగా.. పలు ఈవెంట్స్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి వెళ్లి రావడంతో నిజమేనని అంతా అనుకున్నారు.

కానీ ఇందులో నిజం లేదని ప్రతి ప్రభాస్ ఇద్దరూ క్లారిటీ ఇచ్చారు. కానీ ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సందు చేసిన ట్వీట్ తో మరో సారి వీళ్ళ పెళ్లి టాపిక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.. బ్రేకింగ్ న్యూస్.. ప్రభాస్ కృతి సనన్ ల ఎంగేజ్మెంట్ వచ్చేవారం మాల్ దీవ్స్ లో జరగనుంది.. సో హ్యాపీ ఫర్ దెమ్.. అని ఉమైర్ సందు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ అవుతుంది.
అయితే ఉమెన్స్ సందు సినిమాల రివ్యూలే అంత జెన్యూన్ గా ఉండవు. మరి ఈ వార్తలో కూడా నిజం ఉండదని కొంతమంది అభిమానులు కొట్టి పారేస్తున్నారు. మరి కొంతమంది ప్రభాస్ పెళ్లి గురించి గుడ్ న్యూస్ చెప్పావు అంటూ.. ఆ ట్వీట్ ని వైరల్ చేసే పనిలో పడ్డారు. ఇది నిజం అనుకుంటున్నా మరి కొంతమంది ఫ్యాన్స్.. డార్లింగ్ ప్రభాస్ అన్న ఇది చీటింగ్ మాకు చెప్పకుండానే ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నావా అంటూ పోస్టులు చేస్తున్నారు.