Kalki 2898AD : కల్కి కి అక్కడ మరో రికార్డు.. అస్సలు ఊహించి ఉండరు..

- Advertisement -

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి.. ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు మోత మోగిస్తుంది.. ఇండియన్‌ సినిమాలోనే ఓ కొత్త రకమైన జోనర్‌లో సినిమా రావడం ఓ విశేషమైతే, సైన్స్ ఫిక్షన్‌కి, పురాణాలు జోడించడం మరో విశేషం. మహాభారతంలోని కొన్ని సన్నివేశాల ఆధారంగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది.. ప్రభాస్‌ హీరోయిజం, అమితాబ్‌ బచ్చన్‌ యాక్షన్‌, దీపికా ఎమోషన్స్, కైరా లవ్‌, కమల్‌ హాసన్‌ విశ్వరూపం సినిమాకి మెయిన్‌ ఎలిమెంట్లుగా నిలిచాయని చెప్పొచ్చు.. అయితే ఈ సినిమా తెలుగులోనే కాదు.. నార్త్ లో కూడా రికార్డుల మోత మోగిస్తుంది..

kalki 2898 AD

ప్రస్తుతం ఈ మూవీ తొమ్మిది రోజుల్లో 800కోట్లు దాటింది. ఆదివారం `కల్కి`కి బాగా కలిసి వస్తుంది. యాభై కోట్లకుపైగా కలెక్షన్లు వస్తాయని చెప్పొచ్చు. ఇలా వచ్చే వారంలో ఈ మూవీ వెయ్యి కోట్లు దాటుతుంది.. నార్త్ అమెరికా లో మాత్రం కలెక్షన్స్ తో దుమ్ము  దులిపేస్తుంది.. సినిమా విడుదలకు ముందు నుంచే రికార్డులను అందుకుంటుంది.. తాజాగా మరో మైల్‌ స్టోన్‌కి చేరుకుంది. 15 మిలియన్‌ డాలర్ల కలెక్షన్లని పూర్తి చేసుకుంది. అంటే 125కోట్లకుపైగా కలెక్షన్లు వచ్చాయి. దీనికంటే ముందు `బాహుబలి 2`, `జవాన్‌` సినిమాలు ఉన్నాయి..

- Advertisement -

గతంలోని బాహుబలి సొంతం చేసుకున్న రికార్డులను ఇప్పుడు కల్కి సినిమా బ్రేక్ చేసింది.. మొత్తం వరల్డ్ రికార్డులను కల్కి కొల్ల గొట్టేస్తుంది.. త్వరలోనే 2వేల కోట్ల క్లబ్ లోకి చేరబోతుందని ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. నాగ్‌ అశ్విన్‌ రూపొందించిన `కల్కి 2898 ఏడీ`లో ప్రభాస్‌, కమల్‌ హాసన్‌, అమితాబ్‌ బచ్చన్, దీపికా పదుకొనె, దిశా పటానీ, విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌, మృణాల్‌ ఠాకూర్‌, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్‌, బ్రహ్మానందం వంటి వారు నటించిన విషయం తెలిసిందై. వైజయంతి మూవీస్‌ ఆరు వందల కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు… అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్స్ ను రాబడుతుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here