అభిమానులకు బర్త్ డే ట్రీట్ గా పవర్ స్టార్ ఓజీ టీజర్ లాంచ్….

- Advertisement -

పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైటెడ్ ఓజీ చిత్రం టీజర్ డేట్ ఫిక్స్ అయింది. డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. సుజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం విడుదలకు ముందు నుంచే భారీగా ఉన్నాయి.పవన్ లైన్ అప్ లో ఉన్న అన్ని మూవీస్ కంటే లాస్ట్ లో సైన్ చేసినప్పటికీ ఈ మూవీ షూటింగే ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది.

OG
OG

రీసెంట్ గా విడుదలైన పవన్ బ్రో చిత్రం మాస్ మానియా సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ నటించిన ఓజీ చిత్రంపై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. #TheyCallHimOG అని సోషల్ మీడియాలో అభిమానులు హడావిడి చేస్తున్నారు.

pawan kalyan og movie
pawan kalyan og movie

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రోజి చిత్రం నుంచి ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ గా విడుదల అయ్యే విధంగా మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 50% పైగా ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిపోయింది. పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మూవీ మేకర్స్ భారీ అప్డేట్ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

అనుకున్న షెడ్యూల్ ప్రకారం షూటింగ్ పూర్తి అయితే చిత్రం డిసెంబర్ లో విడుదల అవుతుంది. మార్చి లేక ఏప్రిల్ 2024లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నవంబర్ లేక డిసెంబర్ నెలలో సినిమాని విడుదల చేస్తారు. అలా కాకుండా నవంబర్ లేక డిసెంబర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంటే 2024 వేసవి సెలవులకు ఈ మూవీ విడుదలవుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ యాక్టర్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంతో మొదటిసారి అతను సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here