Poori: వేర్ ఈజ్ పుష్ప అన్నట్లు వేర్ ఈజ్ పూరి అండ్ చార్మి…? అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఈ బిజినెస్ పార్ట్నర్స్ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో కానీ ఇటు పబ్లిక్ లో కానీ కనిపించడం లేదు. దీంతో వీరిద్దరూ ఏమయ్యారు అనే చర్చ మొదలైంది. అభిమానులు వెతుకులాట మొదలుపెట్టారు. ఇదంతా లైగర్ ఎఫెక్ట్ఏనా..? అన్న ఆలోచనలో పడ్డారు. దర్శకుడు పూరి జగన్నాథ్ కి ఈ పరిస్థితి ఊహించనిది ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు.డైనమిక్ డైరెక్ట్ గా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాథ్ సినిమాలు అంటే పడి చచ్చే ఆడియన్స్ ఉన్నారు.
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్స్ ఆయన ఒకరు. హీరో ఇసానికి కొత్త హరోఇజం నేర్పిన డైరెక్టర్. జీవిత సత్యాలతో కూడిన ఆయన వన్ లైనర్స్ అద్భుతంగాఉంటాయి. ఇడియట్,పోకిరి, బిజినెస్ మాన్ చిత్రాలలో పూరి హీరోల పాత్రలను తీర్చిదిద్దున తీరు కొత్తగా ఉంటుంది. పూరి జగన్నాథ్ సూపర్ టాలెంట్ డైరెక్టర్ అండ్ రైటర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒక దశకు వచ్చాక ఆయన జల్సాలకు అలవాటు పడ్డారు. లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ తన క్రియేటివిటీని కోల్పోయారు.
పోకిరి విడుదలై దాదాపు 18 ఏళ్లు అవుతుంది. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసిన ఆ స్థాయి చిత్రం మరల ఆయనకు పడలేదు. కొన్ని చిత్రాలు తెరకెక్కించాయి అయితే పరాజ్యాలే ఎక్కువ. రెండు వారాల్లో స్క్రిప్ రాసి మూడు నెలల్లో పూరి సినిమా తీసేస్తాడు. అంత స్పీడ్ ఇ స్మార్ట్ శంకర్ ఫార్మ్ లోకి టైగర్ మూవీ తో పాతాళంలోకి పడిపోయారు. కొన్ని నెలలుగా పూరి- చార్మి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఆ మధ్య ముంబై ఎయిర్పోర్ట్ కనిపించారు. మరలా వీరిద్దరూ మీడియా కంట్లో పడలేదు. ఛార్మి అయితే సోషల్ మీడియాకు పూర్తిగా దూరమయ్యారు. ఆమె చివరి ఇంస్టాగ్రామ్ పోస్ట్ గత ఏడాది సెప్టెంబర్ లో చేశారు.పూరి మాత్రం మ్యూసింగ్స్ చేస్తూ జనాలతో కొంచెం టచ్ లో ఉన్నారు. ఓనెల రోజులుగా ఆయన అవి కూడా చేయడం లేదు. దీంతో పూరి-చార్మి ఏమయ్యారని ఫాన్స్ వెతుకులాటం మొదలెట్టారు.