Poonam Pandey : నిన్న ఉదయం మన అందరం నిద్ర లేవగానే పూనమ్ పాండే మరణవార్త వినాల్సి వచ్చింది. సరిగ్గా 32 ఏళ్ళు కూడా లేని ఈ కుర్ర హీరోయిన్ క్యాన్సర్ వ్యాధితో చనిపోవడాన్ని ఆమె అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఎదో ఒక మూల ఈ వార్త నిజం కాకుంటే బాగుండును అని అందరూ అనుకున్నారు. ఆమె దగ్గర పని చేసే వ్యక్తిగత బాడీ గార్డ్ కూడా పూనమ్ చనిపోలేదని బలంగా నమ్ముతున్నాడు.

ఎందుకంటే కుటుంబ సభ్యులు ఇప్పటి వరకు పూనమ్ పాండే చనిపోయిన ఘటన గురించి మాట్లాడలేదు. అలాగే సోషల్ మీడియా లో ఎక్కడా కూడా పూనమ్ పాండే మృతదేహానికి సంబంధించి ఫోటోలు కానీ, వీడియోలు కానీ లేవు. సన్నిహితులు ఆమె కుటుంబ సబ్యులకు కాల్ చేస్తుంటే ఎవ్వరూ కూడా సమాధానం ఇవ్వడం లేదు. అసలు నిజమేంటో ఇప్పటికీ క్లారిటీ లేదు. ఆమె ఇంస్టాగ్రామ్ అకౌంట్ నుండి పోస్ట్ పడింది కాబట్టి చనిపోయింది అనే నమ్మాల్సి వస్తుంది.

ఇదంతా పక్కన పెడితే పూనమ్ పాండే తెలుగు లో కూడా ఒక సినిమాలో నటించింది. ఆ సినిమా పేరు ‘మాలిని & కో’. ఈ చిత్రం లో బిగ్ బాస్ ఫేమ్ సామ్రాట్ రెడ్డి హీరో గా నటించాడు. ఇదంతా పక్కన పెడితే పూనమ్ పాండే కి పెద్ద హీరోయిన్ అవ్వాలని కోరిక ఉండేది. ఆమె అలా అవ్వడానికి అన్నీ విధాలా అర్హురాలు. అయితే ఆమె అవసరం ని గుర్తించిన ఒక టాలీవుడ్ యంగ్ హీరో అవకాశాలు ఇప్పిస్తాను అంటూ ఈమె వెంటపడ్డాడు.

అలా వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడి అది డేటింగ్ చేసే వరకు దారి తీసింది. కానీ ఆ హీరో ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాడు. ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా ఈమెని హీరోయిన్ గా పెట్టుకోమని దర్శక నిర్మాతలకు సజెస్ట్ చెయ్యలేదు. చివరికి ఆయన హీరో గా నటించిన సినిమాలో కూడా హీరోయిన్ ఛాన్స్ ఇవ్వలేదట. పూనమ్ పాండే సమయం మొత్తం వృధా అయ్యింది, అలా ఆమె కెరీర్ అనుకున్న రేంజ్ కి వెళ్లలేకపోయింది.