Poonam Pandey : బాలీవుడ్ హీరోయిన్ పూనమ్ పాండే మరణవార్తతో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. దాంతో పాటు ఆమె అభిమానులు కూడా విషాదంలో మునిగిపోయారు. పూనమ్ 32 ఏళ్ల వయసులో గర్భాశయ క్యాన్సర్‌తో మరణించింది. ఈ విషయాన్ని ఆమె మేనేజన్ ఇన్ స్టాలో ధృవీకరించారు. అయితే ఈ విషయంలో ఇప్పుడు ఓ ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
పూనమ్ పాండే మరణం గర్భాశయ క్యాన్సర్ వల్ల కాదని, డ్రగ్ ఓవర్ డోస్ వల్లే జరిగిందని ఆమె సన్నిహితుడు ఒకరు జూమ్ తో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఆమె ఎలాంటి మందులు తీసుకుంటుందో నిర్ధారించలేదు. ఆమె మరణానికి అసలు కారణం ఏమిటనే దానిపై కుటుంబ సభ్యులు అధికారికంగా ఇంకా ఎటువంటి సమాచారం వెల్లడించలేదు.
పూనమ్ మరణ వార్త వెలుగులోకి వచ్చినప్పటి నుండి ఆమె కుటుంబం నిశ్శబ్ధంగా ఉంది. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అయితే అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉన్నాయని చెబుతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో మరింత సమాచారం కోసం యావత్ దేశం ఎదురు చూస్తోంది. శుక్రవారం ఉదయం పూనమ్ పాండే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ వచ్చింది. అందులో “ఈ ఉదయం మనందరికీ చాలా కష్టంగా ఉంది. సర్వైకల్ క్యాన్సర్ కారణంగా మా ప్రియమైన పూనమ్‌ను కోల్పోయామని చెప్పడానికి బాధగా ఉంది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఇంత హఠాత్తుగా జరగడంతో ఎవరూ నమ్మలేకపోతున్నారు. ప్రస్తుతం పూనమ్ వయసు కేవలం 32 ఏళ్లు.