Poonam Kaur : భయంకరమైన వ్యాధి బారిన పడ్డ పూనమ్.. బట్టలుకూడా వేసుకోలేని స్థితి

- Advertisement -


Poonam Kaur : చేసింది తక్కువ సినిమాలే అయినా వివాదాలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న హీరోయిన్ పూనమ్ కౌర్. మరో సారి ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. తను ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు… ఇటీవల మీడియాతో చెప్పుకొచ్చింది. తాను చావు అంచుల వరకు వెళ్లి వచ్చానని, డిప్రెషన్‌లోకి వెళ్లానని, ఆ టైంలో ఓ దర్శకుడు తనను దారుణంగా అవమానించాడంటూ పూనమ్ కౌర్ మీడియాతో పంచుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరోసారి తనను ఫైబ్రోమైయాల్జియా అనే వ్యాధి ఎంతగా బాధించిందో వివరించింది. అంతే కాకుండా దీనికి చికిత్స విధానాన్ని కూడా డా.మంతెనతో కలిసి ఆమె అందరికీ తెలియజేశారు.

‘నేచురోపతి లెజెండ్ డా.మంతెనగారిని కలవడం ఎంతో ఆనందం కలిగించింది. ఫైబ్రోమైయాల్జియా వైద్యానికి సంబంధించి ఆయన ఇచ్చిన సూచనలు అమూల్యం. మంచి మనసుగల వ్యక్తితో ఒక ఎపిసోడ్ లో పాలు పంచుకునే అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం’ అంటే పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. ఫైబ్రోమైయాల్జియా వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాడని, కనీసం బట్టలు కూడా వేసుకోలేకపోయానని చెప్పుకొచ్చారు. ఎంతో అలసటగా అనిపించిందంటూ పూనమ్ కౌర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు.

Poonam Kaur
Poonam Kaur

నిత్యం ఏదో ఓ విధంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటారు పూనమ్. ఈ మధ్య చిరంజీవి త్రివిక్రమ్ ఫోటో మీద పూనమ్ స్పందించడంతో మళ్లీ కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. చిరు త్రివిక్రమ్ కౌగిలించుకుని ఉన్న ఫోటోను చూసిన పూనమ్ కౌర్ అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఆ ఫోటోలు, ఆ కలయికను తన గుండె బద్దలైనట్టుగా బ్రోకెన్ హార్ట్ సింబల్‌ను పెట్టేసింది. పూనమ్ కౌర్ మధ్యలో బుల్లితెరపై ఓ సీరియల్ చేసింది. నాతిచరామి అనే ఓ సినిమాలో కనిపించింది. తన టాలెంట్‌కు తగ్గ అవకాశాలను పూనమ్ దక్కించుకోలేకపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here