గ్లామరస్ హీరోయిన్ పూనమ్ బజ్వా ( Poonam Bajwa ) ఫొటోషూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినిమాలకు దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే ఫొటోలను పంచుకుంటూ రచ్చ చేస్తోంది. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ కనిపిస్తున్న పూనమ్ బజ్వా.. అదే క్రమంలో బోల్డ్ ఫొటోషూట్లతోనూ మంటలు రేపుతోంది. హాట్ హాట్ అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. గ్లామర్ బ్యూటీ తెగింపునకు ఫ్యాన్స్ సైతం షాక్ అవుతున్నారు.

లేటెస్ట్ పిక్స్ లో పూనమ్ బజ్వా (Poonam Bajwa) నిలువెత్తు అందాలను ప్రదర్శించింది. బ్లాక్ కలర్ టూ పీస్ బికినీలో అసలైన పరువాలను ప్రదర్శించింది. బీచ్ లో గ్లామర్ గేమ్ ఆడుతూ కుర్రాళ్లను డక్ అవుట్ చేసింది. షాకింగ్ లుక్ లో మెరిసి నెటిజన్ల గుండెలు జారిపోయేలా చేసింది. యంగ్ బ్యూటీ అందాన్ని పొగుడుతూ కామెంట్లు, లైక్స్ తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు.

నవదీప్ హీరోగా రూపొందిన ‘మొదటి సినిమా’ చిత్రంతో పూనమ్ బాజ్వా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముంబై బ్యూటీ. ‘బాస్’ చిత్రంతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ చిత్రంలో సంప్రదాయ దుస్తుల్లో మెరిసి నయనతారకే తన గ్లామర్ తో షాక్ ఇచ్చింది. నటనలోనూ ధీటూ పెర్ఫామెన్స్ ఇచ్చింది. ఆ తర్వాత ‘కుర్రాడు’, చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మెరిసింది. ప్రస్తుతం తమిళం, మలయాళం చిత్రాల్లోనే నటిస్తోంది.