Pooja Hegde : టాలివుడ్ స్టార్ హీరోయిన్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. స్టార్ హీరోల సరసన నటించింది.. గత రెండేళ్లు గా అమ్మడుకు బ్యాడ్ టైమ్ నడిస్తుంది.. ఒక్క సినిమా కూడా భారీ హిట్ ను అందుకోలేక పోయింది..అయిన అవకాశాలు తగ్గలేదు.. వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది.. ఇకపోతే అమ్మడుకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. సోషల్ మీడియాలో లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.. తాజాగా మేకప్ లేకుండా కొన్ని ఫోటోలను షేర్ చేసింది.. అవి ఇప్పుడు రకరకాల కామెంట్స్ తో వైరల్ అవుతున్నాయి..

పూజా హెగ్దే చేతిలో ప్రస్తుతం రెండు భారీ చిత్రాలు ఉన్నాయి. ఒకటి బాలీవుడ్ లో కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన ‘కిసి కా బాయ్ కిసి కి జాన్’లో నటిస్తోంది. ఈ చిత్రం ఈనెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏప్రిల్ 28న అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది..మరోవైపు సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన SSMB28లోనూ నటిస్తోంది. మహేశ్ సరసన రెండోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. శ్రీరామ నవమి సందర్భంగా ఫస్ట్ లుక్, రిలీజ్ డేట్ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. ఇక పూజా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు..త్రివిక్రమ్ సస్పెన్స్ గా ఉంచుతున్నాడు..

పూజా హెగ్దే ఇటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా వీకెండ్ న్యూస్ అందించింది. ఈరోజు ఉదయం వర్కౌట్ చేసినట్టు తెలిపింది. ఆ తర్వాత సెల్ఫీలకు ఫోజులిచ్చింది. అయితే మేకప్ లేకుండా బుట్టబొమ్మ దర్శనమిచ్చి ఫ్యాన్స్ ను ఆశ్చర్యపరిచింది. నేచురల్ బ్యూటీతో ఆకట్టుకుంది.. మేకప్ లేకుండా క్లివేజ్ షో చేసిన బుట్టబొమ్మ అందాల సెల్ఫీల పై కామెంట్స్ చేస్తున్నారు.. అయితే వర్కౌట్ చేయడం ద్వారా మరింత అందంగా కనిపిస్తామని చెప్పుకొచ్చింది. లేటెస్ట్ సెల్ఫీలను పంచుకుంటూనే.. ‘మంచి వ్యాయామం తర్వాత ఆ ఎర్రబడిన బుగ్గలు’ చూడండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది… ఇక సినిమాలు కూడా వరుసగా చేస్తుంది..