Pooja Hegde : పింక్ సూట్ లో బట్టబొమ్మ క్యూట్ ఫోటోషూట్.. వాట్ ఏ బ్యూటీ అంటున్న నెటిజన్స్

- Advertisement -

Pooja Hegde ఈ టాలీవుడ్ బుట్టబొమ్మ ప్రస్తుతం బాలీవుడ్‌పై ఫోకస్ పెట్టింది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ముంబయి ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంలో పూజ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన నటించింది. ఇవాళ ఈ చిత్రం విడుదలై థియేటర్లలో సందడి చేస్తోంది. ఇందులో భాగంగా పూజ ఈ మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది.

Pooja Hegde
Pooja Hegde

కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా ప్రమోషన్స్ కోసం పూజ డిఫరెంట్ ఔట్‌ఫిట్స్‌ను సెలక్ట్ చేసుకుంటోంది. ఓసారి ట్రెండీ.. ఇంకోసారి కూల్ లుక్స్‌లో.. మరోసారి క్యూట్ అట్టైర్‌లో సందడి చేస్తోంది. తాజాగా పూజ రోజ్ ఫ్లవర్‌లా కనిపించింది. ఎందుకంటే గులాబీ రంగు డ్రెస్సులో పూజ అందం భలే గుబాళించింది. పింక్ కలర్ సూట్‌లో పూజ సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. ఎద అందాలకు రోజ్ ఫ్లవర్ అడ్డుపెట్టుకున్నట్లు కనిపిస్తున్న డిజైన్‌లో పూజ స్టన్నింగ్‌గా కనిపించింది.

Pooja

పూజ లేటెస్ట్ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. పింక్ ఫ్లవర్‌లా కనిపిస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎంతైనా పూజ ట్రెడిషనల్ ఔట్‌ఫిట్స్‌లో ఇంకా అందంగా ఉంటుంది కదా అని మాట్లాడుకుంటున్నారు. త్వరగా పూజను టాలీవుడ్ సినిమాల్లో చూడాలనుకుంటున్నాం అని కామెంట్లు చేస్తున్నారు. ఇక పూజ మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి పూజ లుక్ లీకైంది.

- Advertisement -

Hegde

బాలీవుడ్‌లో బిజీ అయిన పూజ తన కోస్టార్ సల్మాన్ ఖాన్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ సినిమా షూటింగ్‌లోనే ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇటీవల స్పందించిన పూజ అలాంటిదేం లేదని స్పష్టం చేసింది. తాను ఇప్పుడు సింగిల్‌గానే ఉన్నట్లు.. ప్రజెంట్ తన ఫోకస్ అంతా సినిమాలపైనే ఉందని క్లారిటీ ఇచ్చింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here