Sreelela : శ్రీ లీల హీరోయిన్ అవ్వడానికి పూజా హెగ్డేనే కారణమా..ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ల లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల పేరు ముందు వరసలో ఉంటుంది. ఈ కన్నడ సోయగం టాలీవుడ్ లోకి వచ్చి రెండేళ్లు మాత్రమే అవుతుంది. ఇప్పటి వరకు ఈ బ్యూటీ చేసింది కూడా రెండు సినిమాలు మాత్రమే. కానీ టాలీవుడ్ ను శ్రీలీల తన కను సైగలతో శాసిస్తోంది. ఇటు యంగ హీరోల సినిమాల్లోనే కాకుండా అటు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, విజయ్ దేవరకొండ వంటి స్టార్ హీరోల సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ తోటి హీరోయిన్లను వనికిస్తోంది. ప్రస్తుతం ఈమె చేతిలో గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్, స్కంద, ఆది కేశవ, భగవత్ కేసరి.. ఇలా పలు చిత్రాలు ఉన్నాయి.

దాదాపు ఎనిమిది ప్రాజెక్టులతో శ్రీలీల క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. అయితే శ్రీలీలకు స్టార్ హోదా దక్కడానికి టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డేనే కారణమట. ఈ సంచల నిజం తాజాగా బయటకు వచ్చింది. శ్రీలీల తెలుగులో చేసిన తొలి చిత్రం పెళ్లి సందడి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పర్యవేక్షణలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించాడు. ఈ చిత్రం జస్ట్ హిట్ అంతే. ఈ మూవీ తర్వాత శ్రీలీల రవితేజకు జోడీగా ధమాకా
వంటి బ్లాక్ బస్టర్ సినిమాలో మెరిసింది. ఈ మూవీతో శ్రీలీల జాతకమే మారిపోయింది. ఇందులో అందం, ఆకట్టుకునే నటనతో పాటు ఊరమాస్ డాన్సులతో టాలీవుడ్ లో ఫిదా చేసింది.

ధమాకా విడుదల తర్వాత శ్రీలీలకు ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ధమాకా మూవీకి ఫస్ట్ ఛాయిస్ శ్రీలీల కాదట. మొదట ఇందులో హీరోయిన్ గా పూజా హెగ్డేను అనుకున్నారట. ఇందులో భాగంగానే పూజా హెగ్డేను సంప్రదించగా.. ఆమె వెంటనే రిజెక్ట్ చేసిందట. రవితేజ వరుస ఫ్లాపుల్లో ఉన్నాడనే కారణంతో పూజా నో చెప్పిందట. దీంతో ధమాకాలో నటించే ఛాన్స్ శ్రీలీలను వరించింది. రెండో సినిమాతోనే ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. అలా ధమాకాలో ఛాన్స్ మిస్ చేసుకుని పరోక్షంగా శ్రీలీలకు స్టార్ హోదాను అందించింది పూజ హెగ్డే.