Raj Tarun : నేటి తరం లో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అవ్వడం అనేది సాధారణమైన విషయం కాదు. అలాంటి పోటీ వాతావరణం ఉన్న ఈ ఇండస్ట్రీ లో బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఒక సామాన్య కుర్రాడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అసిస్టెంట్ డైరెక్టర్ గా రాణించి, ఆ తర్వాత ‘ఉయ్యాలా జంపాల’ సినిమా ద్వారా హీరో గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సక్సెస్ అందుకున్న నటుడు రాజ్ తరుణ్. ఈ చిత్రం తర్వాత వరుసగా ఆయనకీ రెండు మూడు భారీ బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా వచ్చాయి. ఆ సినిమాల ద్వారా వచ్చిన ఇమేజిని రాజ్ తరుణ్ ముందుకు కొనసాగించలేకపోయాడు. కొన్నాళ్ళకు ఆయనకీ వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ వచ్చాయి.
దీంతో ఆయన కెరీర్ బాగా డౌన్ అయ్యింది. ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి కానీ, మార్కెట్ పూర్తిగా పోవడం తో ఫేడ్ అవుట్ అయిపోయాడు. అయితే రాజ్ తరుణ్ పేరు నేడు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతుంది. ఎందుకంటే తనని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని రాజ్ తరుణ్ మోసం చేసాడు అంటూ లావణ్య అనే అమ్మాయి నేడు హైదరాబాద్ లోని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. 11 ఏళ్లుగా రాజ్ తరుణ్ తో రిలేషన్ లో ఉన్నానని, ఒక గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామని, ఈ గ్యాప్ లో రాజ్ తరుణ్ ఒక పాపులర్ సినీ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని ఫిర్యాదు లో పేర్కొంది.
ఆ హీరోయిన్ కి సంబంధించిన మనుషులు రాజ్ తరుణ్ ని వదిలేయకపోతే కిడ్నాప్ చేసి చంపేస్తామని బెదిరించారు అంటూ ఆమె వాపోయింది. ఈ వార్త సోషల్ మీడియా లో బాగా ప్రచారం అవ్వడంతో రాజ్ తరుణ్ లో ఈ కోణం కూడా ఉందా అని నెటిజెన్స్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూసేందుకు అమాయకంగా కనిపించే రాజ్ తరుణ్ ఇలా ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటాడని ఊహించలేదు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.