Pallavi Prashanth : ఈ సీజన్ తెలుగు బిగ్ బాస్ షో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మనమంతా చూసాము. ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగిన ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో లో పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలవగా, సీరియల్ నటుడు అమర్ దీప్ రన్నర్ గా నిలిచాడు. పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత ప్రతీ ఒక్క సామాన్యుడు మరియు రైతు బిడ్డలు ఎంతో సంతోషించారు.

ఎన్నడూ లేని విధంగా అన్నపూర్ణ స్టూడియోస్ కి దాదాపుగా లక్ష మంది పల్లవి ప్రశాంత్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పడానికి చూసారు అంటే ఆయన ఈ షో ద్వారా దక్కించుకున్న ఆదరణ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా బాగానే ఉంది కానీ, ఆయన అభిమానులు అన్నపూర్ణ స్టూడియోస్ లో కంటెస్టెంట్స్ కార్లను ద్వంసం చెయ్యడం ఇప్పుడు పెద్ద దుమారమే రేపింది. ముఖ్యంగా రన్నర్ అమర్ దీప్ కారు పైకి కొంతమంది ఆకతాయిలు ఎక్కి డోర్ అద్దాలు పగలగొట్టడం భయానక వాతావరణం ని నెలకొల్పింది.

కేవలం అమర్ దీప్ కార్ మాత్రమే కాదు, అశ్వినీ మరియు గీతూ రాయల్ కార్లు కూడా ద్వంసం అయ్యాయి. దీంతో ఎంతో హర్ట్ అయిన వీళ్లిద్దరు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసారు. ఆ తర్వాత కొన్ని భయానక పరిస్థితులలో ఉన్న వీడియోస్ ని కూడా చూపించారు. ఇవన్నీ పరిశీలించిన తర్వాత సుమోటోగా పోలీసులు సెక్షన్ 147,148 , 290,353, 427 రెడ్ విత్ మరియు 149 సెక్షన్స్ క్రింద FIR నమోదు చేసారు. పల్లవి ప్రశాంత్ పోలీసులు వారిస్తున్నా కూడా ర్యాలీ చెయ్యడానికి ప్రయత్నం చేయడాన్ని ఫ్యాన్స్ ని కావాలని రెచ్చగొట్టే చర్యగా పోలీసులు భావిస్తున్నారు.

కేవలం పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఆ స్టూడియో కి పెద్ద ఎత్తున అమర్ దీప్ ఫ్యాన్స్ కూడా వచ్చారు. ర్యాలీ చెయ్యాలని ప్రయత్నం అమర్ కూడా చేసాడు. కానీ పోలీసులు వద్దని చెప్పగా ఆయన వెంటనే వెళ్ళిపోయాడు. కానీ ప్రశాంత్ మాత్రం పోలీసులపైనే దౌర్జన్యం చేసాడు. ఆయన వల్లనే కంటెస్టెంట్స్ పై దాడులు చేసారని భావించిన పోలీసులు ఈమేరకు ప్రశాంత్ ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.