Pippa Movie : యంగ్ హీరో ఇషాన్ ఖత్తర్, సీతారామం బ్యూటీ మృణాల్ నటించిన మూవీ పిప్పా. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు. దీంతో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయ్యింది. కాగా రెహ్మాన్ కంపోజ్ చేసిన “కరర్ ఓయి లౌహో కపట్ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఇదే పాట వివాదంలో చిక్కుకుంది. ఈ పాటపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది.

దానికి కారణం ఈ పాట ప్రముఖ బెంగాలీ రైటర్ నజ్రుల్ ఇస్లామ్ రాసిన ఇస్లామిక్ దేశభక్తి గీతం కావడమే. ఆ సాంగ్ ని మార్చి పిప్పా మూవీలో వాడారు. దీంతో ఏఆర్ రెహమాన్ ని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఆ కాంట్రవర్సీపై మూవీ టీం స్పందించిది. అందరికీ క్షమాపణలు కూడా చెప్పింది.
ఒరిజినల్ సాంగ్ రైటర్ నుంచి హక్కులను తీసుకున్నామని స్పష్టం చేసింది పిప్పా మూవీ టీం. పాట లిరిక్‌ని మార్చుకుని వాడుకునేలా హక్కుదారులైన మిస్టర్ కల్యాణి కాజీ, విట్ నెస్ అనిర్బన్ కాజీ ద్వారా అనుమతి తీసుకున్నామంది. అఫీషియల్ గా కాపీ రైట్స్ తీసుకున్నాకే ఆ పాటని తమ సినిమాలో వాడుకున్నామంది పిప్పా మూవీ టీం.
అభిమానుల భావోద్వేగాలను గౌరవిస్తామని.. ఎవరినీ కించపరచాలని పాటను రూపొందించలేదంది పిప్పా మూవీ టీం. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని.. ఈ పాట ద్వారా ఇబ్బంది కలిగిందుకు క్షమాపణలు చెప్పారు. దీనిపై ప్రొడక్షన్ కంపెనీ రాయ్ కపూర్ ఫిలిమ్స్ నుంచి అధికారికంగా ప్రకటన విడుదల చేశారు.