Venu swamy : పబ్ లో గబ్బు పని చేస్తూ అడ్డంగా బుక్ అయిన వేణుస్వామి.. నీలో ఈ యాంగిల్ కూడా ఉందా?

- Advertisement -

Venu Swamy : ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సినిమా సెలబ్రిటీల జాతకాలు చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు. ముఖ్యంగా సమంత, నాగ చైతన్య పెళ్లి చేసుకుని విడిపోతారని చెప్పడం.. అలా ఆయన చెప్పిన నాలుగు సంవత్సరాల తర్వాత వారు విడిపోవడం జరిగింది. దీంతో ఆయన ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు.

అప్పటి నుంచి ప్రముఖులు, సినీ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాడు. కానీ ఈ మధ్య ఏపీ ఎన్నికల ఫలితాల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పాడు. కానీ ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజం కాకపోవడంతో సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ కు గురయ్యాడు. దీంతో నేను ఇక జాతకాలు చెప్పను అంటూ ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.

venu swamy
venu swamy

అయితే తాజాగా ఈయనకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. పబ్లిక్‌గా ఈయన చేసిన పనికి అందరూ షాక్ అవుతున్నారు. పూజలు పున స్కారాలు చేసే వేణు స్వామి సడెన్‌గా ఓ పబ్ లో దర్శనం ఇచ్చారు. వీకెండ్ లో మందు కొట్టేందుకు బార్‌కి వెళ్లాడు. తన మిత్రుడితో కూర్చుని మద్యం సేవించాడు. ఆయన మందుకొడుతున్న సమయంలో కొందరు ఫోటోలు, వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇది వేణుస్వామి.. అసలు నిజస్వరూపం ఇదే అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఈయన గతంలోనే తనకు మందు అలవాటు ఉందని బహిరంగంగానే చెప్పిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here