నటీనటులు : నాగ శౌర్య , మాళవిక నాయర్, మేఘా చౌదరి , అవసరాల శ్రీనివాస్
డైరెక్టర్ : అవసరాల శ్రీనివాస్
సంగీతం : కళ్యాణి మాలిక్
నిర్మాతలు : టీజీ విశ్వ ప్రసాద్ , దాసరి పద్మజ
Phalana Abbayi గత కొంతకాలం గా కెరీర్ లో సరైన హిట్టు లేక ఇబ్బంది పడుతున్న హీరో నాగ శౌర్య.హిట్టు కోసం ఎన్నో విధాలుగా ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు కానీ, ఆయన కోరుకున్న సక్సెస్ మాత్రం దొరకడం లేదు.ఈసారి ఎలా అయినా హిట్టు కొట్టాలనే కసితో తనకి మొట్టమొదటి సూపర్ హిట్ సినిమాని ఇచ్చిన అవసరాల శ్రీనివాస్ తో ‘ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి’ అనే సినిమా చేసాడు.గతం లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ‘ఊహలు గుసగుసలాడే’ అనే సినిమా విడుదలైంది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా అప్పట్లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.నాగ శౌర్య ని హీరో గా అలాగే అవసరాల శ్రీనివాస్ ని డైరెక్టర్ గా స్థిరపడిపొయ్యేలా చేసింది ఈ చిత్రం.అలాంటి కాంబినేషన్ నుండి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది ఇప్పుడు ఈ రివ్యూ లో చూడబోతున్నాము.
కథ :
సంజయ్ (నాగ శౌర్య) తన ఇంటర్ చదువుని పూర్తి చేసుకొని బీటెక్ చదువు కోసం ఒక ఇంజనీరింగ్ కాలేజీలో చేరుతాడు.ఇంజనీరింగ్ కాలేజీ అన్న తర్వాత సీనియర్స్ జూనియర్స్ ని ర్యాగింగ్ చెయ్యడం సర్వసాధారణం.అలా సంజయ్ ని కూడా సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ ఉంటారు.అప్పుడు అనుపమ (మాళవిక నాయర్ ) వచ్చి అతనిని సీనియర్స్ నుండి కాపాడుతుంది.ఆ తర్వాత వీళ్లిద్దరి మధ్య స్నేహం ఏర్పడుతుంది.బీటెక్ పూర్తైన తర్వాత ఇద్దరు లండన్ కి వెళ్లి MS చేస్తారు.అనుపమ కి వేరే సిటీ లో మంచి ఉద్యోగం వస్తుంది.తనకి చెప్పకుండా ఉద్యోగానికి అప్లై చేసి దూరంగా వెళ్ళిపోతున్ననందుకు సంజయ్ చాలా బాధపడుతాడు.అలా వాళ్ళ మధ్య దూరం పెరిగిపోతున్న సమయం లో పూజ ‘మేఘ చౌదరి’ పరిచయం అవుతుంది,అక్కడి నుండి కథ ఎలా మలుపులు తిరిగింది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
కథనం:
అవసరాల శ్రీనివాస్ సినిమా అంటే ఆయన మార్కు హ్యూమర్, ఆయన మార్కు డైలాగ్స్ ని కచ్చితంగా ఆశిస్తారు జనాలు.ఈ సినిమాలో అవన్నీ కనిపిస్తాయి కానీ, పూర్తి స్థాయి ప్యాకేజిలాగా ఉండదు.అక్కడక్కడా కొన్ని పంచులు పేలుతాయి.కొన్ని సన్నివేశాలు నవ్విస్తాయి అంతే.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో కూడిన లవ్ స్టోరీ అంటే కచ్చితంగా ఫీల్ గుడ్ మూమెంట్స్ ఉండాలి, అప్పుడే కమర్షియల్ గా వర్కౌట్ అవుతాయి.కానీ ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది.స్క్రీన్ ప్లే కూడా స్లో గా ఉండడం ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాగ అనిపిస్తుంది.సన్నివేశాలు కాస్త తేడా కొట్టినప్పుడు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలను కాపాడుతాయి అని అంటుంటారు.కానీ కళ్యాణి మాలిక్ అందించిన మ్యూజిక్ పెద్ద ఆకట్టుకోలేదు.ఇదంతా పక్కన పెడితే ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ ఈ చిత్రం లో ఒక పాట పాడడం ఆడియన్స్ కి అగ్ని పరీక్ష లాగ మారింది.
ఇక నటీనటుల విషయానికి వస్తే నాగ శౌర్య ఇందులో చాలా అందంగా ఉన్నాడు,అద్భుతంగా నటించాడు కూడా.సినిమాకి హైలైట్ ఆయన నటనే, ఇక హీరోయిన్ గా చేసిన మాళవిక నాయర్ కూడా తన పాత్రకి తగ్గట్టు చక్కగా నటించి అదరగొట్టేసింది.ముఖ్యంగా వీళ్లిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ పై చాలా చక్కగా ఉంది.కానీ కథలో డెప్త్ లేకపోవడం తో భావోద్వేగాలకు ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు.
చివరి మాట : అంచనాలను అందుకోలేకపోయింది..అవసరాల మార్కు కామెడీ సన్నివేశాలు కొన్ని చోట్ల బాగానే వర్కౌట్ అయ్యింది.అది చూసి సంతృప్తి పడేవాళ్ళు ఈ సినిమాని చూసేయొచ్చు.
రేటింగ్ : 2.25 /5