Payal Rajput : కేవలం ఒకటి రెండు సినిమాలతో ఇండస్ట్రీ లో మంచి పాపులారిటీ ని దక్కించుకున్న కుర్ర హీరోయిన్స్ లో ఒకరు పాయల్ రాజ్ పుత్. ఈమె కార్తికేయ మొదటి చిత్రం ‘ఆర్ ఎక్స్ 100 ‘ తో ఎలాంటి సెన్సేషన్ సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఆమె బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడమే కాకుండా పూర్తి స్థాయి నెగటివ్ రోల్ లో అదరగొట్టేసింది.

అయితే ఈమె మొదటి సినిమాతోనే నెగటివ్ రోల్ లో నటించడం వల్లో ఏమో తెలియదు కానీ, ప్రతీ సినిమాలోనూ అదే తరహా పాత్రలు పోషిస్తూ వచ్చింది. దీంతో ఆమె స్టార్ హీరోయిన్ రేంజ్ కి రాలేకపోయింది. ఇప్పటి వరకు ఈమె చిన్న చిన్న హీరోలతోనే నటిస్తూ వచ్చింది కానీ, పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటించలేదు. అందుకు కారణం ఇండస్ట్రీ లో నమ్మిన ఒక డైరెక్టర్ ఇచ్చిన సలహాలు తీసుకోవడం వల్లే అని బహిరంగంగా చెప్పింది.

రీసెంట్ గా ఈమె గురించి సోషల్ మీడియా లో ఒక వార్త తెగ ప్రచారం అవుతుంది. అదేమిటంటే ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత రాజ్ కుమార్ అనే దర్శకుడితో ప్రేమాయణం నడిపింది. ఇతనితో కలిసి ఫోటోలు దిగడం, అవి ఇంస్టాగ్రామ్ లో అప్లోడ్ చెయ్యడం వంటివి చాలానే చేసింది. వీళ్లిద్దరి వ్యవహారం చాలా దూరం వెళ్ళింది. అయితే అది డైరెక్టర్ రాజ్ కుమార్ ఇంట్లో తెలియడం తో, ఆయన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని చెప్పారట.

ఇదే విషయం ని పాయల్ రాజ్ పుత్ కి రాజ్ కుమార్ చెప్పగా, ఆమె అందుకు ససేమీరా నో చెప్పింది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నేను ఇండస్ట్రీ లో అవకాశాలను సంపాదించుకుంటున్నాను, ఇలాంటి సమయం లో పెళ్లి చేసుకుంటే ఉన్న ఫేమ్ క్రేజ్ మొత్తం పోతుంది, నేను ఇందుకు ఒప్పుకోలేను అని చెప్పి బ్రేకప్ చేసిందట. అప్పటి నుండి ఆ డైరెక్టర్ మానసికంగా ఎంతో కృంగిపోయి సినిమా ఇండస్ట్రీ కి కూడా దూరం అయ్యాడట. అలా ప్రేమ పేరుతో ఆర్ ఎక్స్ 100 సినిమాలో లాగానే ఒక వ్యక్తి జీవితం ని నాశనం చేసిందంటూ పాయల్ రాజ్ పుత్ పై నెటిజెన్స్ విరుచుకుపడుతున్నారు.
