Payal Rajput : ‘వాడెవడో తెలియదు.. కానీ ఎలాంటి వాడో తెలుసు. వాడినైతే నేను ఇప్పటి వరకు కలిసింది లేదు. ఏ రోజైతే నేను వాడిని కలుస్తానో వాడికి అదే ఆఖరి రోజు’ అని మాస్ వార్నింగ్ ఇస్తోంది పాయల్ రాజ్ పుత్. ఏంటి పాయల్ కు అంత కోపం ఎందుకు వచ్చింది. ఇంతకీ ఈమె అంత స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందెవరికీ?.. ఎవరి కోసం ఆమె వెతుకుతుంది ? అని ఆలోచిస్తున్నారా.. అయితే ఆ మేటరేంటో తెలుసుకోవాలంటే మాత్రం ‘రక్షణ’ సినిమా చూడాల్సిందేంటున్నారు చిత్ర బృందం.

టాలీవుడ్ కు ‘Rx100’ సినిమాతో పరిచమైంది పాయల్ రాజ్ పుత్. తొలి సినిమాతోనే సెన్సేషన్ సృష్టించి యావత్ సినీ పరిశ్రమ దృష్టి తనపై పడేలా చేసుకుంది. కానీ ఎందుకో తెలియదు.. తనకు ఒక టైప్ క్యారెక్టర్లు మాత్రమే రావడంతో తర్వాత కెరీర్ కొంచెం డ్రాప్ అయింది. ఇటీవల ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ తనేంటో నిరూపించుకుంది. ఇప్పటి వరకు చేసిన పాత్రలకు భిన్నంగా.. పవర్‌ఫుల్ ఇన్వెస్టిగేటివ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘రక్షణ’. రోషన్, మానస్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలను పోషించారు. మంగళవారం ఈ సినిమా టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్‌ను గమనిస్తే.. ఓ హంతకుడు దారుణంగా హత్యలు చేస్తుంటాడు.. అతనెవరో కనిపెట్టి అరెస్ట్ చేయాలని పోలీస్ ఆఫీసర్ అయిన పాయల్ ట్రై చేస్తున్నట్లు అర్థం అవుతుంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్‌గా రక్షణ చిత్రం మెప్పించనుంది.
హరిప్రియ క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రణదీప్ ఠాకోర్ డైరెక్షన్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. శరవేగంగా రూపొందుతోన్న ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావటానికి సన్నాహాలు చేస్తున్నారు. దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ మాట్లాడుతూ ‘‘ ‘రక్షణ’ టీజర్‌కు చాలా మంచి స్పందన వస్తుంది. ఇదొక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ డ్రామా. పాయల్ రాజ్ పుత్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఘటన స్పూర్తితో ఈ కథను తీర్చిదిద్దాం. ఏ దశలోనూ రాజీ పడకుండా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమాను తెరకెక్కించాం” అన్నారు.