కీర్తి సురేష్.. నా ఛాన్స్ కొట్టేసింది.. పాయల్ సంచలన కామెంట్స్​

- Advertisement -


కార్తికేయ సరసన ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. ఆ సినిమాలో అమ్మడు అందచందాలు చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ మూవీలో పాయల్ ఎంత హాట్ గా కనిపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ హీరోయిన్స్ మాదిరి పాయల్ ఫిజిక్ సూపర్ గా ఉంటుంది. పాన్ ఇండియా హీరోయిన్స్ మాదిరే తన ఫిజిక్ మెయింటైన్ చేస్తుంది . అంతే కాదు డైరెక్టర్స్ ఏం అడిగినా సరే ..నో అనకుండా తన అందాలను విచ్చలవిడిగా తెరపై ప్రదర్శిస్తుంటుంది. మరి ఇన్ని క్వాలిటీస్ ఉన్న ఈ బోల్డ్ బ్యూటీ పాయల్ ఎందుకో స్టార్ హీరోయిన్ అవలేదు. ఆందాల ప్రదర్శన పుష్కలంగా ఉన్న ఆమెకు నటన రాదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి

Keerthi suresh Dazzling looks on netflix event
Keerthi suresh Dazzling looks on netflix event

అయితే ఇటీవల పాయల్ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. మహేష్ బాబు కెరియర్ లోనే వన్ ఆఫ్ ద సూపర్ హిట్ మూవీ సర్కారు వారి పాట. ఈ సినిమాను ‘నేను మిస్ చేసుకున్నాను అంటూ ప్రకటించింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్రలో నేను మెరవాల్సింది . కానీ ఆమె ఆ ఛాన్స్ కొట్టేసింది . కీర్తి సురేష్ కూడా ఈ సినిమాలో బాగా నటించింది . అయితే నా డ్రీమ్ హీరోతో నటించాలన్న కోరిక.. కోరికగానే మిగిలిపోయిందంటూ.. మహేశ్ సరసన నటించే అవకాశం ఎప్పుడోస్తుందో ఎదురు చూస్తున్నానంటూ.. మహేశ్ పై తనకున్న ప్రేమను బయటపెట్టింది.

అయితే అభిమానులకు అర్థం కాని విషయం ఏంటంటే..? మేకర్స్ నిజంగానే కీర్తి సురేష్ పాత్ర కోసం పాయల్ రాజ్ పుత్ ని అప్రోచ్ అయ్యారా..? అన్న విషయం మాత్రం సస్పెన్స్ గానే మిగిలింది. దీనిపై సర్కారీ వారి పాట టీమ్ స్పందించకపోతే బ్యాడ్ కౌంటర్స్ పడే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here