Payal Rajput : ఆర్ ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ. ఆ సినిమాలో అమ్మడి గ్లామర్ షో చూసి కుర్రాళ్లు కెవ్వు కేక అనేశారు. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అమ్మడికి అవకాశాలు వెల్లువలా వస్తాయని అంతా భావించారు. కానీ అమ్మడి ఆశలన్నీ అడియాశలుగానే మిగిలిపోయాయి. అరకొర ఛాన్సులే తప్పా తన కెరీర్ కు ప్లస్ అయ్యే విధంగా మంచి ఆఫర్లేతే ఏం రాలేదు. ఇటీవల ఆమె మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా తనకు మంచి పేరు తీసుకొచ్చినా దాని తర్వాత మాత్రం మళ్లీ పాయల్‌కు అవకాశాలు వచ్చినట్టుగా కనిపించడం లేదు. అయితే పాయల్‌కు మళ్లీ ఏ దర్శక నిర్మాత అవకాశం ఇస్తాడో చూడాలి.

ప్రస్తుతం పాయల్ రాజ్‌పుత్ తన తల్లికి సర్జరీ చేయించింది. మోకాళ్లకు జరిగిన ఈ ఆపరేషన్ చాలా పెయిన్ ఫుల్‌గా ఉందని, అయినా ఇప్పుడు ఆపరేషన్ సక్సెస్ ఫుల్‌గా జరిగిందని పేర్కొంది. ఇప్పుడు అమ్మ నడుస్తోందంటూ.. అభిమానులందరూ కూడా అమ్మ గురించి ప్రార్థించండంటూ పాయల్ వేసిన ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆపరేషన్ అనంతరం అమ్మ ఎలా నడుస్తోందో చూపిస్తూ పాయల్ ఇన్ స్టా స్టోరీలో షార్ట్ వీడియోను షేర్ చేసింది. పాయల్ ప్రస్తుతం అమ్మ వద్దే ఉన్నట్టుగా కనిపిస్తోంది.

పాయల్‌కు ఇండస్ట్రీలో సరైన అవకాశాలు రావడం లేదనిపిస్తోంది. ఆర్ఎక్స్ 100 సినిమాకు ముందు బాలీవుడ్‌లో సీరియల్స్ చేస్తుండేది. పంజాబీ ఇండస్ట్రీలో కూడా అడపాదడపా సినిమాలు చేసింది. అయితే ఆర్ఎక్స్ 100 తరువాత వచ్చిన క్రేజ్ తో హైద్రాబాద్‌కు షిఫ్ట్ అయిపోయింది. ఇక్కడే తన కెరీర్‌ను చూసుకుంటోంది. పాయల్‌కు అందం, నటించగలిగే సత్తా ఉన్నా కూడా మేకర్లు మాత్రం ఎక్కువగా ఛాన్సులు ఇవ్వడం లేదు. గత ఏడాది మంగళవారం అనే సినిమాతో పాయల్‌కు మంచి విజయమే వచ్చింది. డైరెక్టర్ అజయ్ భూపతి మళ్లీ పాయల్‌ను ఎలా చూపించాలో అలా చూపించాడు. ఆమెను ఎలా చూపిస్తే.. ఎలా యాక్ట్ చేయిస్తే ఆడియెన్స్‌కు నచ్చుతుందో అలానే చేయించాడు. ఇక టెక్నికల్‌గానూ మంగళవారం సినిమా నెక్ట్స్ లెవెల్లో పెట్టేశాడు అజయ్ భూపతి.