Payal Rajput : టాలీవుడ్ యంగ్ బ్యూటీ పాయల్ రాజ్ అందరికీ తెలిసిందే. హీరో కార్తీక్ సరసన RX 100తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇందులో చాలా బోల్డ్ గా నటించి యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ మాత్రం తన ఖాతాలో వేసుకోలేకపోయింది. తాజాగా మంగళవారం సినిమాతో ప్రేక్షకులను అలరించింది ముద్దుగుమ్మ.
ఈ అమ్మడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ పలు విషయాలను పంచుకుంటుంది. ఇటీవల పాయల్ రాజ్ పుత్ తన వాలెంటైన్స్ డేని ఎలా, ఎక్కడ జరుపుకున్నారో తెలియజేసే వీడియోను షేర్ చేసింది. అందులో ఆమె తన ప్రియుడు సౌరభ్‌తో కలిసి పబ్‌లో కనిపించింది. సినిమా షూటింగ్లో భాగంగా పాయల్ రాజ్ పుత్ తన ప్రియుడి తలపై బీర్ బాటిల్‌తో కొట్టింది.
ఈ వీడియోను షేర్ చేస్తూ.. నేను నా ప్రేమికుల దినోత్సవాన్ని ఇలా జరుపుకుంటున్నాను. మీరు ఎలా జరుపుకుంటున్నారో వ్యాఖ్యానించండి అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీనికి మళ్లీ ట్రై చేయండి అని ఓ నెటిజన్ వ్యాఖ్యానించగా, దానికి సౌరబ్ ఇది ఒక బ్యాడ్ ఐడియా అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన కొందరు ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ నాకొద్దు బాబోయ్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.