Payal Ghosh : తెలుగులో తక్కువ సినిమాలు చేసినా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ పాయల్ ఘోష్ .. పలు సినిమాలలో హీరోయిన్ గా .. సెకండ్ హీరోయిన్ గా కూడా నటించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ఊసరవెల్లి సినిమాలో తమన్నా ఫ్రెండ్ గా నటించింది. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచింది. అతడు తనను ఫిజికల్ గా చాలా ఇబ్బంది పెట్టాడని పేర్కొంది.
తన పదకొండవ సినిమాను ప్రకటనతో పాటు సంచలన విషయాలు బయటపెట్టింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఇది నా 11వ సినిమా.. ఒకవేళ నేను కొంతమంది కోరినట్లుగా వారితో పడుకొని ఉంటే కచ్చితంగా ఇది నా 30వ సినిమా అయ్యేది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ చాలా ఉంది. ఆఫర్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా కొన్నింటిని తప్పకుండా వదులుకోవాలి. గతంలో కూడా ఈ క్యాస్టింగ్ కౌచ్ చాలా ఎక్కువగా ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా ప్రచారం జరగడంతో జనాల్లో కొద్దిమేర అవగాహన వచ్చింది. అందుకే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ కాస్త తగ్గిందంటూ చెప్పుకొచ్చింది.
ఇకపోతే ఆఫర్ల కోసం చాలామంది పాయల్ ఘోష్ ను రకరకాలుగా ఇబ్బంది పెట్టారు అని.. కానీ తాను ఏమాత్రం ఇలాంటి వాటికి కొంచెం కూడా లొంగలేదట. ముఖ్యంగా పాయల్ ఘోష్ మాత్రమే కాకుండా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఈ క్యాస్టింగ్ కౌచ్ బారిన పడి చేతికి వచ్చిన ఆఫర్లను వదులుకున్నారు. ఇప్పుడు ఉన్న వారిలో కూడా చాలామంది దీనిపై అనేక కారణాలు చెప్పి పలు సంచలన కామెంట్లు చేశారు. ఇక ఇప్పుడు తాము ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా చెబుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ఇకపోతే ఇండస్ట్రీలో స్టార్స్ కాకుండా.. కింద స్థాయి వారు కూడా కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులకు గురి అవుతున్నారని సమాచారం.