Pawan Kalyan : వామ్మో! పవన్ కళ్యాణ్ భార్యకు అన్ని వందల కోట్ల ఆస్తులున్నాయా.. స్టార్లనే మించిపోయిందిగా..

- Advertisement -

Pawan Kalyan : ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ దాదాపు 70 వేల ఓట్ల మెజారిటీతో గెలిచి ఏపి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన‌కి ఏపీ డిప్యూటీ సీఎంతో పాటు మరి కొన్ని కీల‌క ప‌ద‌వులు అందించారు. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుపుని అటు ఫ్యాన్స్, ఇటు కుటుంబ‌స‌భ్యులు చాలా గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ స్థితికి చేర‌డం వెన‌క తన భార్య అన్నా లెజినోవా ఉందని ఆమె ఇచ్చిన స‌పోర్ట్‌తోనే ఆయన ఇంత విజ‌యం సాధించ‌గ‌లిగార‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి వెన్నుదన్నుగా ఉన్న అన్న లెజినోవా హార‌తి ఇచ్చి వీర తిల‌కం దిద్ది మ‌రి ప్రచారానికి పంపడం చూశాం.. అలాగే ఎన్నికల్లో గెలిచాక కూడా వీర‌తిల‌కం దిద్ది త‌న భ‌ర్తని చూసి మ‌రిసిపోయింది. ఇక ఇటీవ‌ల ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పులు చేతుల‌తో ప‌ట్టుకుని అందరి చేత శభాష్ అనిపించుకున్న అన్నా లెజినోవా గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

పవన్ కల్యాణ్ మూడో భార్య అయిన అన్నా లెజినోవా ఆయనతో పెళ్లి కాకముందు మోడలింగ్ చేసింది. ఆ తర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో క‌లిసి ‘తీన్ మార్’ సినిమాలో న‌టించింది. ఆ స‌మ‌యంలో వీరిద్దరి మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్పడి అది ప్రేమ‌గా మారింది. ఇక 2013 సెప్టెంబ‌ర్ 30న ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి మార్క్ శంక‌ర్ ప‌వ‌నోవిచ్ కుమారుడు జ‌న్మించాడు. అయితే పెళ్లి తర్వాత అన్నా లెజినోవా సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. ఆమె రష్యన్‌ అయినప్పటికీ పవన్ కల్యాణ్‌తో అప్పుడప్పుడు ఇండియాకి వస్తూ పలు సేవా కార్యక్రమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. అయితే ఒకానొక సమయంలో పవన్, అన్నా లెజినోవా మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారన్న వార్తలు కూడా వచ్చాయి. అందుకే ఆమె మెగా ఫ్యామిలీలో జరిగే ఫంక్షన్స్‌కు వెళ్లడం లేదని ప్రచారం జరిగింది.

- Advertisement -

ఇదిలా ఉంటే.. తాజాగా, అన్నా లెజినోవా ఆస్తులు వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆమెకు రష్యా, సింగపూర్ ప్రాంతాల్లో ఏకంగా రూ. 1800 కోట్లు విలువ చేసే ఆస్తులు భారీగా ఉన్నట్లు సమాచారం. పవన్ కల్యాణ్‌తో పెళ్లి కాకముందే అన్నా లెజినోవా బిజినెస్ చేసి సంపాదించిందని తెలుస్తోంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ.. అన్నా లెజినోవా ఆస్తుల గురించి తెలిసిన వారంతా స్టార్ హీరోయిన్లు కూడా ఇంత సంపాదించి ఉండరు.. స్టార్ల అందరినీ మించిపోయిందిగా అంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here