Sai Dharam Tej : పవన్ కళ్యాణ్ గెలుపు.. కాలినడకన తిరుమలకు మేనల్లుడు..

- Advertisement -

ఏపీలో తాజాగా జరిగిన ఎన్నికలు అందరికీ షాక్ ఇచ్చాయి.. ఎవరు ఊహించని విధంగా ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.. ఈ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందారు.. మెగా ఫ్యామిలీ ఆనందానికి అవధులు లేవు.. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ గెలుపు కోసం బాగా కష్టపడ్డాడు.. మామ ఎన్నికల్లో తెలిస్తే కాలినడకన తిరుమలకు వస్తానని మొక్కుకున్నాడు.. ఆ మొక్కు చెల్లించేందుకు అతను తిరుమలకు వెళ్లినట్లు తెలుస్తుంది..

నిన్న సాయంత్రం హైదరాబాద్ నుంచి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఆ తరువాత తిరుపతిలో రాత్రి బసచేసి తెల్లవారి జామున అలిపిరి మెట్ల మార్గంలో కొండపైకి చేరుకున్నారు. అనంతరం అక్కడ విఐపీ గెస్ట్ హౌస్ లో రెడీ అయి, విఐపీ దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.. సాయి ధరమ్ తేజ్ కాలినడకలో తిరుమల కొండ ఎక్కడంతో అభిమానులు ఫోటోలు దిగేందుకు ఇష్టపడ్డారు.. సాయి ధరమ్ కాలినడకన వెళ్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది..

- Advertisement -

ఈ వీడియో పై సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. పవన్ కు ఈ అల్లుడు వీరాభిమాని అని అందరు అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.. ఇక పోతే ఈ హీరో ఇటీవల పేరు మార్చుకోవడంతో పాటుగా సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించాడు.. దాంతో పాటుగా కొత్త ప్రాజెక్టులలో నటించేందుకు రెడీ అవుతున్నాడు.. త్వరలోనే కొత్త సినిమాను అనౌన్స్ చెయ్యనున్నట్లు సమాచారం..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here