Pawan Kalyan : బయట మాత్రమే కాదు, సోషల్ మీడియా లో కూడా పవన్ కళ్యాణ్ కి ఉన్నంత క్రేజ్ ఫాలోయింగ్ ఏ హీరోకి కూడా లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో ఆయన పెట్టే పోస్టులకు ఏ హీరోకి లేనంత రీచ్ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో అయితే పవన్ కళ్యాణ్ పెట్టే ప్రతీ పోస్టుకి దాదాపుగా 1 మిలియన్ కి పైగా లైక్స్ వస్తుంటాయి.

రీసెంట్ గా ఆయన అయోధ్య రామ మందిరం ని దర్శించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడికి వెళ్లిన తర్వాత పవన్ కళ్యాణ్ రామ మందిరం తో కలిసి సెల్ఫీ దిగి తన ట్విట్టర్ అకౌంట్ లో అప్లోడ్ చేసాడు. ఈ సెల్ఫీ కి ట్విట్టర్ జనాల నుండి మామూలు రేంజ్ రెస్పాన్స్ రాలేదు. 24 గంటల లోపే ఈ సెల్ఫీ ఫోటో కి దాదాపుగా 25 వేలకు పైగా రీట్వీట్లు, లక్ష 50 వేలకు పైగా లైక్స్ వచ్చాయి.

ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ దేవర కంటే ఎక్కువ లైక్స్ వచ్చేలా ఉందని అంటున్నారు నెటిజెన్స్. దేవర ఫస్ట్ లుక్ కి ఫుల్ రన్ లో దాదాపుగా లక్షా 90 వేలకు పైగా లైక్స్ వచ్చాయి. పవన్ కళ్యాణ్ సెల్ఫీ వీడియో కి రెండు మూడు రోజుల్లోపే ఆ రేంజ్ వస్తుందని అంటున్నారు ఫ్యాన్స్. ఒక మామూలు సెల్ఫీ వీడియో కి ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తే, పవన్ కళ్యాణ్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఆయన సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్స్ విడుదల చేస్తే ఏ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో అని అంటున్నారు ఫ్యాన్స్.

ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ తన సినిమాలకు సంబంధించి ఒక్కటంటే ఒక్క అప్డేట్ కూడా ట్విట్టర్ అకౌంట్ నుండి వెయ్యలేదు. కేవలం రాజకీయాల కోసం మాత్రమే తన ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ అకౌంట్స్ ని వాడుతూ వచ్చాడు. భవిష్యత్తులో ఒక్కసారైనా సినిమాలకు సంబంధించిన ట్వీట్స్ లేదా పోస్ట్స్ వేస్తే చూడాలని ఉందంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
రామకార్యం అంటే రాజ్య కార్యం
— Pawan Kalyan (@PawanKalyan) January 22, 2024
ప్రజా కార్యం…🙏 జై శ్రీ రామ్ pic.twitter.com/qkDGgRMWtZ