OG Movie : దీపావళి కి పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ టీజర్ రెడీ..వైరల్ అవుతున్న టీజర్ లీక్డ్ డైలాగ్!

- Advertisement -

OG Movie : ప్రస్తుతం టాలీవుడ్ నుండి తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ మూవీస్ లో అభిమానులతో పాటుగా ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్న చిత్రం ‘ఓజీ’. పవన్ కళ్యాణ్ హీరో గా సుజిత్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

OG Movie
OG Movie

కేవలం పవన్ కళ్యాణ్ కెరీర్ లో మాత్రమే కాదు, రీసెంట్ సమయం లో ఒక స్టార్ హీరో నుండి వచ్చిన ‘ది బెస్ట్’ గ్లిమ్స్ వీడియో ఇదేనంటూ అందరూ ప్రశంసల వర్షం లో ముంచి ఎత్తారు. ఇక రీసెంట్ గా దసరా కానుకగా విడుదల చేసిన మరో పోస్టర్ కి అయితే ఫ్యాన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు నవంబర్ 10 వ తారీఖున దీపావళి సందర్భంగా ‘ఓజీ‘ చిత్రానికి సంబంధించి ఒక టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఈ టీజర్ కి సంబంధించిన అప్డేట్ మరో రెండు మూడు రోజుల్లో ఇవ్వనున్నారని టాక్. ఈ టీజర్ లో యాక్షన్ పార్ట్ సన్నివేశాలతో పాటుగా, పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఒక డైలాగ్ కూడా ఉంటుందని సమాచారం. గ్లిమ్స్ లో మనం చూసింది కేవలం ఒక్క శాతం మాత్రమే అని, టీజర్ చూసిన తర్వాత ఈ చిత్రం మీద ఉన్న అంచనాలు డబుల్ అవుతాయని.

- Advertisement -

ఇప్పటి వరకు ఎన్నడూ చూడని పవర్ ఫుల్ అవతారం లో పవన్ కళ్యాణ్ కనిపించబోతున్నాడని టాక్. ఇప్పటి వరకు 5 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకున్న ఈ చిత్రం, పవన్ కళ్యాణ్ ఇచ్చే 30 రోజుల డేట్స్ తో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకోబోతుంది. వచ్చే ఏడాది మార్చి 22 వ తారీఖున ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here