Shivaji : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి హీరో గా మరియు క్యారక్టర్ ఆర్టిస్టుగా దాదాపుగా 96 సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజి ని ఏర్పాటు చేసుకున్న శివాజీ రాజకీయ పరంగా కూడా తనదైన మార్కుని ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం వల్ల శివాజీ సినిమాలకు దూరం అయ్యాడు.

అందువల్ల ఆర్థికంగా కూడా బాగా నష్టపోయాడు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యి అద్భుతంగా గేమ్ ఆడుతూ తనకంటూ చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దోళ్ల వరకు ప్రతీ ఒక్కరు మెచ్చే కంటెస్టెంట్ గా మారాడు. శివాజీ కి కెరీర్ లో పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే అది బిగ్ బాస్ అనే చెప్పాలి. హౌస్ నుండి బయటకి వెళ్లిన తర్వాత కచ్చితంగా ఆయనకీ మంచి ఆఫర్స్ వస్తుంది అని చెప్పొచ్చు.

ఇదంతా పక్కన పెడితే అప్పట్లో శివాజీ కెరీర్ పీక్ రేంజ్ కి చేరుకునే ఒక సినిమాని మిస్ చేసుకున్నాడు అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ సినిమా మరేదో కాదు, పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తొలిప్రేమ’ చిత్రం. ఈ సినిమాని కొత్త వాళ్ళతో తియ్యాలని అప్పట్లో డైరెక్టర్ కరుణాకరన్ అనుకున్నాడు. అందులో భాగంగా ఆయన ఆడిషన్స్ చేస్తున్న సమయం లో ‘మాస్టర్’ చిత్రం లో నటించిన శివాజీ ని చూసి ఇతను అయితే మన సినిమాకి బాగుంటాడు కదా అని అనుకున్నాడట.

కానీ అదే సమయం లో పవన్ కళ్యాణ్ మొదటి సినిమా పోస్టర్ ని చూసి, హీరో అంటే ఇలా ఉండాలి, నా తొలిప్రేమ కథ కి ఈయనే పర్ఫెక్ట్ గా సరిపోతాడని ఆయన అనుకోవడం, వెంటనే పవన్ కళ్యాణ్ ని కలిసి ఆ కథని వినిపించడం, ఆయన వెంటనే ఓకే చెయ్యడం అన్నీ జరిగిపోయాయి. ఈ విషయాన్నీ స్వయంగా కరుణాకరన్ చెప్పాడు. ఆరోజు ఆయన పవన్ కళ్యాణ్ ఫోటో చూసి ఉండకపొయ్యుంటే శివాజీ తొలిప్రేమ సినిమా చేసేవాడు, ఆ తర్వాత ఆయన గ్రాఫ్ మరో లెవెల్ కి వెళ్లి ఉండేది. బ్యాడ్ లక్ అంటే ఇదే.