Lavanya : మెగా కోడలు లావణ్యను బండ బూతులు తిడుతున్న పవన్ ఫ్యాన్స్.. ఏం తప్పు చేసిందిరా బాబు ?

- Advertisement -

Lavanya : హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్న క్రమంలోనే అతడితో ప్రేమలో పడి ఇటలీలో గ్రాండ్ గా పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మెగా ఇంటి కోడలిగా కుటుంబ బాధ్యతలను నెరవేరుస్తుంది. అలాంటి లావణ్య త్రిపాఠి పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా కోపంగా ఉన్నారు. దానికి కారణం లావణ్య త్రిపాఠి చేసిన పిచ్చి పనే అంటూ చెబుతున్నారు.

లావణ్య త్రిపాఠి ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ హీరోయిన్ .. వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తన స్టైల్ లో సినిమాల్లో నటిస్తుంది. ఇటీవల మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించి మెప్పించింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ తన నప్పే కథల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తుంది. పవన్ కళ్యాణ్ గెలవాలంటూ మెగా ఫ్యామిలీ లేడీస్ అందరూ కూడా పిఠాపురంలోకి వచ్చి ప్రచారం చేయగా కొంతమంది సోషల్ మీడియా వేదికగా రెస్పాండ్ అవుతూ వచ్చారు. అయితే మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆయనకి సంబంధించి ఒక పోస్ట్ కూడా చేయకపోవడం.. కనీసం వీడియో సందేశం కూడా ఇవ్వకపోవడం ఆయన అభిమానులకు కోపం తెప్పించింది.

- Advertisement -

అంతేకాదు పవన్ కళ్యాణ్ గెలవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ఉండే జనాలు పూజలు చేస్తూ ఉంటే మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. మామిడి కాయ పచ్చడి పోస్ట్ షేర్ చేయడం సంచలనంగా మారింది. మామిడికాయ పచ్చడి మేకింగ్ అంటూ టబ్లో పచ్చడి కలుపుతున్న ఫోటో లావణ్య త్రిపాఠి షేర్ చేసింది. దీంతో అది చూసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఘాటుగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గెలవాలని ఒక్క మెసేజ్ కూడా చేయకుండా మామిడికాయ పచ్చడి పెట్టుకుంటున్నావా..? నీకు పవన్ కళ్యాణ్ కన్నా పచ్చడే ముఖ్యమా..? బూతులు తిడుతూ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here