Ram Gopal Varma : ఒకప్పుడు తన దర్శకత్వ ప్రతిభతో ఇండియా ని ఒక ఊపు ఊపిన దర్శకులలో ఒకడు రామ్ గోపాల్ వర్మ. కానీ ఇప్పుడు మాత్రం పిచ్చి పట్టిన వాడిలాగా తనకి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నాడు. తన టాలెంట్ మొత్తాన్ని మర్చిపోయి బూతు సినిమాలను తీస్తూ, వివాదాలతో సావాసం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నాడు. ఇతన్ని చూసి జాలి పడాలో, కోపం తెచ్చుకోవాలో కూడా అర్థం కానీ స్థితిలో ఆయన అభిమానులు ఉన్నారు.
ప్రస్తుతం చేతినిండా అప్పులు ఉండడం తో వైసీపీ పార్టీ ఫండింగ్ ద్వారా ‘వ్యూహం’ అనే సినిమా తీసాడు. ఇందులో వై ఎస్ జగన్ ని హీరో గా చూపిస్తూ, చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ ని నెగటివ్ గా చూపించాడు. విజయవాడ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని ఏర్పాటు చేసి వైసీపీ పార్టీ ఎమ్యెల్యేలను మరియు మంత్రులను ముఖ్య అతిధులుగా పిలిచారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి జనాలు ఎవ్వరూ కూడా రాకపోవడం తో ఖాళీ కుర్చీలకు ఉపన్యాసాలు ఇవ్వాల్సిన దుస్థితి వచ్చింది. అయితే పవన్ కళ్యాణ్ ని నెగటివ్ గా చూపిస్తూ తీసిన ఈ సినిమాని నిరసిస్తూ నిన్న రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ కి పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వచ్చి, రామ్ గోపాల్ వర్మ కి నిరసనగా నినాదాలు చేసారు. అనంతరం ఆయన దిష్టి బొమ్మలను తగలబెట్టి రామ్ గోపాల్ వర్మ కారు అద్దాలను పగలగొట్టారు.
గతం లో కూడా రామ్ గోపాల్ వర్మ పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా సినిమా తీసాడు. అప్పుడు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ కి చెందిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్లి చితకబాదాలని చూసారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ధాటిని తట్టుకోలేక బాత్రూం లోకి వెళ్లి దాక్కున్నాడు. మళ్ళీ ఇన్నాళ్లకు పవన్ ఫ్యాన్స్ ని రెచ్చగొట్టాడు, దీని పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.