పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రానికి ‘బ్రో’ అనే టైటిల్ ని ఖరారు చేసి నిన్న ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ ని విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ మోషన్ పోస్టర్ సోషల్ మీడియా ని ఒక రేంజ్ లో ఊపేసింది. ఎక్కడ చూసిన ఈ మోషన్ పోస్టర్ గురించే చర్చ.శివుని శ్లోకం ని ‘బ్రో’ అనే టైటిల్ వచ్చేటట్టుగా ఎన్నో విధాలా శబ్దాలతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తన మార్కుని కనిపించేలా చేసాడు.
ఈ చిత్రానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు మరియు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, సహా నిర్మాతగా కూడా వ్యవహరించాడు.ఈ చిత్రం జులై 28 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.ఇది ఇలా ఉండగా ఈ సినెమా మోషన్ పోస్టర్ ఇప్పుడు టాలీవుడ్ లో ఆల్ టైం రికార్డు ని నెలకొల్పింది.
ఈ మోషన్ పోస్టర్ నిన్న సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు విడుదలైంది. ఇప్పటికీ కేవలం 18 గంటలు మాత్రమే అవ్వగా, ఈ 18 గంటలకు సుమారుగా 4.8 మిలియన్ వ్యూస్ ని దక్కించుకుంది.ఇది ఆల్ టైం టాలీవుడ్ రికార్డు గా చెప్పుకోవచ్చు, గతం లో విడుదలైన ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం మోషన్ పోస్టర్ సుమారుగా 24 గంటల్లో 4.74 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత #RRR చిత్రానికి 4.65 మిలియన్ వ్యూస్ వచ్చాయి.
ఒక మామూలు ప్రాంతీయ బాషా చిత్రం మోషన్ పోస్టర్ ఏకంగా పాన్ ఇండియా సినిమాల రికార్డ్స్ ని బద్దలు కొట్టిందంటే సాధారణమైన విషయం కాదు, అది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాస్ వల్లే జరిగింది అని చెప్పొచ్చు. బ్రో కి ఈ రేంజ్ వ్యూస్ వస్తే, ఇక పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న #OG చిత్రానికి ఏ రేంజ్ రికార్డ్స్ వస్తాయో అర్థం చేసుకోవచ్చు.