Salaar : అంతకు ముందు కేవలం కన్నడ సినీ పరిశ్రమకి మాత్రమే పరిమితమైన హోమబుల్ సంస్థ, కేజీఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించారు. రీసెంట్ గా ‘సలార్’ చిత్రం తో మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందుకొని ఫుల్ జోష్ లో ఉన్న హోమబుల్ సంస్థ త్వరలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చెయ్యడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.
ఈ మేరకు పవన్ కళ్యాణ్ ని వారు గత ఏడాది కలిసి చర్చలు జరిపారట. పవన్ కళ్యాణ్ కూడా వారి బ్యానర్ లో కలిసి నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అడ్వాన్స్ కూడా హోమబుల్ సంస్థ నుండి తీసుకున్నాడట. అయితే డైరెక్టర్ ఎవరు అనేది ఇప్పటి వరకు ఖరారు కాలేదు. హోమబుల్ సంస్థ కాబట్టి కచ్చితంగా ప్రశాంత్ నీల్ డైరెక్టర్ అని అందరూ అనుకోవచ్చు. కానీ అది దాదాపుగా అసాధ్యం అనే చెప్పాలి.
ఎందుకంటే ప్రశాంత్ నీల్ పెద్ద పాన్ ఇండియన్ డైరెక్టర్, అతనితో సినిమా చెయ్యాలంటే నిర్దిష్టమైన డేట్స్ ఇవ్వాలి. పవన్ కళ్యాణ్ కి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ వల్ల ఏ క్షణం లో అయినా ఆయన పొలిటికల్ గా బిజీ అవ్వొచ్చు. కాబట్టి ఆయనతో సినిమా పాన్ ఇండియన్ డైరెక్టర్స్ కి చాలా కష్టం. అయితే డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి ఎవరు ఏమిటి అనేది తెలియాలంటే న్యూ ఇయర్ వరకు ఆగాల్సిందే.
ఎందుకంటే ఆరోజే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్డేట్ బయటకి రాబోతుంది అట. అప్పటి వరకు ఈ సస్పెన్స్ తప్పదు అని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఈ ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మరియు హరి హర వీరమల్లు సినిమాలు చేస్తున్నాడు. ఈ మూడు సినిమాల షూటింగ్స్ ఎన్నికల కారణంగా ఆగిపోయాయి. వచ్చే ఏడాది మే నెల నుండి మళ్ళీ షూటింగ్స్ మొదలు కాబోతున్నాయి.