టాలీవుడ్ లో ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఓటీటీ కాలం లో కూడా రీమేక్ సినిమాలతో బంపర్ ఓపెనింగ్స్ కొల్లగొట్టే సత్తా ఉన్న ఏకైక ఇండియన్ హీరో ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే అని చెప్పొచ్చు. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న పవన్ కళ్యాణ్, క్రేజీ కాంబినేషన్ సెట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేందుకు ఉదాహరణగా నిలుస్తుంది ‘#OG’ అనే చిత్రం.

‘రన్ రాజా రన్’ మరియు ‘సాహూ’ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన సుజిత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా ఎంతో స్టైలిష్ గా కనిపించబోతున్నాడు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఇప్పటికే మూడు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. ఈ చిత్రం పై అటు అభిమానుల్లో కానీ, ట్రేడ్ లో కానీ మామూలు అంచనాలు లేవు.

ఈ చిత్రం లో నషస్తున్నందుకు గాను పవన్ కళ్యాణ్ ఏకంగా వంద కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుంటున్నాడట. ఇప్పటి వరకు పాన్ ఇండియా హీరోలైన రామ్ చరణ్ మరియు ప్రభాస్ మాత్రమే ఈ రేంజ్ పారితోషికం అందుకున్నారు, వాళ్ళ తర్వాత ఆ రేంజ్ కి చేరుకుంది ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ సినిమాలు చెయ్యలేదు. ఆయనకీ పాన్ ఇండియన్ మార్కెట్ అయితే ప్రస్తుతానికి లేదు, అయినా కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటే పవన్ కళ్యాణ్ రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు అంటూ ట్రేడ్ పండితులు అంటున్నారు.

అంతే కాదు ఈ చిత్రానికి నాన్ థియేట్రికల్ ప్రీ రిలీజ్ బిజినెస్ (డిజిటల్ + సాటిలైట్ రైట్స్) అన్నీ భాషలకు కలిపి 250 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయిందట. పాన్ ఇండియన్ మార్కెట్ లేని షారుఖ్ ఖాన్ మరియు సల్మాన్ ఖాన్ మాత్రమే ఈ రేంజ్ రెమ్యూనరేషన్ తీసుకుంటూ వాళ్ళ సినిమాలు ఈ రేంజ్ లో బిజినెస్ చేశాయని. వాళ్ళ తర్వాత రీజినల్ హీరో గా కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే ఇంత బిజినెస్ జరిగిందని అంటున్నారు ట్రేడ్ పండితులు.