పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘బ్రో – ది అవతార్’ వచ్చే జులై 28 వ తారీఖున విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రొమోషన్స్ ఇప్పటి నుండే ప్రారంభించేసింది మూవీ టీం.ఇప్పటికే పవన్ కళ్యాణ్ మరియు సాయి ధరమ్ తేజ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్స్ విడుదల అయ్యాయి.

దీనికి ఫ్యాన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈరోజు వీళ్లిద్దరు కలిసి ఉన్న పోస్టర్ ఒకటి విడుదల చేసారు, దీనికి కూడా రెస్పాన్స్ అదిరిపోయింది.ఈ పోస్టర్ పవన్ కళ్యాణ్ ధరించిన బూట్ల ధర ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. స్టైల్ గా బైక్ మీద కాళ్ళు పెట్టుకొని నిల్చున్న పవన్ కళ్యాణ్ ని చూసి ఫ్యాన్స్ ఎంతగానో మురిసిపోతున్నారు.

అయితే పవన్ కళ్యాణ్ కి సంబంధించినది ఏదైనా వెంటనే కొనేయాలి అనే ఆతృతలో ఉండే ఫ్యాన్స్ కి ఆయన ధరించిన బూట్లు ప్రత్యేకంగా ఆకర్షించాయి. వెంటనే గూగుల్ లో వెతకగా ఈ బూట్ల ధర చూసి ఫ్యాన్స్ కి మతి పోయినంత పని అయ్యింది. ఈ బూట్ల ధర $1238 అమెరికన్ డాలర్స్. ఇండియన్ కరెన్సీ లెక్కలో చూస్తే అక్షరాలా 102227/- రూపాయిలు. ఇది ఒక సగటు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ కి వచ్చే నెల జీతం తో సమానం.

అంతే కాదు ఒక మధ్య తరగతి కుటుంబం చిన్న నానో కార్ కూడా కొనుక్కోవచ్చు.అయితే కొంతమంది పవన్ కళ్యాణ్ ఎంత ఎక్కువ ధర అయినా కొనుక్కోవాలని చూస్తున్నారు.ఈ బూట్లు ఆర్డర్ చేసిన రెండు మూడు రోజుల్లోనే డెలివరీ అయిపోతుందట. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా నటిస్తున్నాడు, సాయి ధరమ్ తేజ్ ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్ గా నటిస్తున్నాడు. తమిళం లో డైరెక్ట్ ఓటీటీ లో విడుదలై మంచి పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘వినోదయ్యా చిత్తం’ కి రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
