పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హరీష్ శంకర్ కాంబినేషన్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించుకొని మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం, ఇందులో పవన్ కళ్యాణ్ రెండు విభిన్నమైన గెటప్స్ లో మనకి కనిపించబోతున్నాడు.అందులో ఒక గెటప్ కి సంబంధించిన పోస్టర్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు మూవీ టీం.

ఈ పోస్టర్ కి ఫ్యాన్స్ నుండి సెన్సషనల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ని హరీష్ శంకర్ బాగా చూపిస్తాడు అనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది కానీ, మరీ ఇంత రేంజ్ మాస్ గా చూపిస్తాడని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు.ఇక కాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ వీడియో విడుదల కాబోతుంది, ఇది ఏ రేంజ్ లో ఉండబోతుందో హరీష్ శంకర్ కేవలం ఒక శాంపిల్ వదిలాడు, దానికి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ కెరీర్ లో బద్రి చిత్రం ఎంత స్పెషల్ అనేది ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఇందులో ఆయన తన నట విశ్వరూపమే చూపించాడు. అప్పటి యూత్ మొత్తం ఈ సినిమా చూసి ఊగిపోయారు, ఆ చిత్రం పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ ఏ విధంగా అయితే ఉంటుందో,’ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా అదే రేంజ్ యాటిట్యూడ్ ని చూపించాడు హరీష్ శంకర్.

ఇక కాసేపట్లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 MM లో ఉస్తాద్ భగత్ సింగ్ గ్లిమ్స్ కి సంబంధించిన ఈవెంట్ జరగబోతుంది.ఈ ఈవెంట్ కి హరీష్ శంకర్ తో పాటుగా నిర్మాతలు కూడా హాజరు కాబోతున్నారు.పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీ ఎత్తున ఈ గ్లిమ్స్ రిలీజ్ కి హాజరు కాబోతున్నారు. 45 సెకండ్స్ నిడివి ఉన్న ఈ గ్లిమ్స్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మీద హైప్ ఎవ్వరూ ఊహించని రేంజ్ కి చేరుకుంటుంది అంటున్నారు మేకర్స్, చూడాలి మరి.