పవర్ స్టార్ Pawan Kalyan..ఈ పేరు కి ఉన్న బ్రాండ్ ఇమేజి గురించి ప్రత్యేకించి చెప్పాలా?, ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో స్టార్ డైరెక్టర్స్ తో పని చెయ్యకుండా, తిరుగులేని స్టార్ గా ఎదిగిన వైనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.చిరంజీవి తమ్ముడిగానే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు, కానీ ఏనాడు కూడా ఆయనని అనుసరించకుండా, తన సొంత పంధాలో వెళ్లి కేవలం 7 సినిమాలతోనే యూత్ ఐకాన్ గా మారిపోయాడు ఆయన.
ఆయన వాడిన వస్తువులను,ఆయన వేసుకున్న దుస్తులను ధరించడానికి అభిమానులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు.మొన్నటికి మొన్న #OG మూవీ షూటింగ్ స్పాట్ లో పవన్ కళ్యాణ్ వేసుకున్న హుడీ ని ఆన్లైన్ లో పెట్టగా అవి హాట్ కేక్స్ లాగ అమ్ముడుపోయాయి.అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్, అప్పట్లో ఇది గమనించే పెప్సీ సంస్థ పవన్ కళ్యాణ్ తో ఒక కమర్షియల్ యాడ్ చేసింది.
అప్పట్లో సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో కమర్షియల్ యాడ్స్ చేసిన మొట్టమొదటి హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. కానీ కొన్నాళ్ళకు కూల్ డ్రింక్స్ లో విషపదార్దాలు ఉన్నాయని, అవి తాగి చాలా మంది చనిపోయారు అనే వార్తలు రావడం తో పవన్ కళ్యాణ్ అప్పటి నుండి కమర్షియల్ యాడ్స్ కి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే లేటెస్ట్ గా పవన్ కళ్యాణ్ మళ్ళీ కమర్షియల్ యాడ్స్ చెయ్యబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.
జియో సంస్థ తమ ప్రొడక్ట్స్ కి మూడు సంవత్సరాల పాటు బ్రాండ్ అంబాసిడర్ గా ఉంటే, ఒక్కో యాడ్ కి పది కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇస్తామని పవన్ కళ్యాణ్ ముందు ఒక బంపర్ డీల్ ని పెట్టిందట. పవన్ కళ్యాణ్ కూడా ఆ యాడ్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అంటే ఇక మనం పవర్ స్టార్ వరుసగా యాడ్స్ లో కూడా చూడొచ్చు అన్నమాట.