Pawan Kalyan : ఎమ్మెల్యేగా పవన్ జీతం ఎంతో తెలుసా.. ? ప్రజల కోసం కోట్ల సంపదను వదులుకున్న గొప్ప వ్యక్తి

- Advertisement -

Pawan Kalyan : ఈ సారి జరిగిన ఎన్నికలు ఏపీలో ఎంతటి ఉత్కంఠను రేకెత్తించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అధికారం మాదే అనుకున్న వైసీపీని మట్టి కరిపించి అనూహ్య రీతిలో కూటమి విజయ ఢంకా మోగించింది. మూడు పార్టీలు కలిసి పోటీ చేసిన ఈ సారి ఎన్నికల్లో కింగ్ మేకర్ ఎవరంటూ ఎవరైనా టక్కున చెప్పే పేరు పవన్ కళ్యాణ్. మన దేశ చరిత్రలో వందకు వందశాతం సక్సెస్ రేట్ సాధించిన రాజకీయ నాయకుల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ అగ్రభాగాన ఉంటారు. మొన్నటి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున పోటీ చేసిన 21 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, ఇద్దరు ఎంపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలిచారు.

pawan kalyan

గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయిన పవన్ కల్యాణ్.. ఈసారి తనతో పాటు తన పార్టీ తరఫున పోటీ చేసిన అందరినీ చట్టసభల్లోకి తీసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు దేశ వ్యాప్తంగా ప్రముఖుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదిలా ఉండగా.. పవన్ కల్యాణ్ జీతభత్యాలకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఎమ్మెల్యేగా పూర్తి జీతం తీసుకుంటానని పవన్ కల్యాణ్ చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో పవన్ కల్యాణ్ ఎమ్మెల్యేగా నెలసరి జీతం ఎంత తీసుకుంటాడని సోషల్ మీడియాలో గట్టిగా చర్చ నడుస్తోంది.

- Advertisement -

ఏపీలో ఒక్కో ఎమ్మెల్యేకు నియోజకవర్గ ఇతర అలవెన్స్‌లు అన్నీ కలిపితే రూ.3.35 లక్షల వేతనం అందుకుంటారు. కాగా పవన్ కళ్యాణ్ కు కూడా ఈ మొత్తా్న్నే నెల జీతంగా అందుకుంటారు. ఇక తెలంగాణ ఎమ్మెల్యేలు మాత్రం రూ.4 లక్షల వేతనం అందుకుంటున్నారు. అయితే, ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ అభిమానులు తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే కెపాసిటీ ఉన్న నువ్వు..కేవలం రూ.3.35 లక్షల కోసం అన్నీ వదులుకుని ప్రజల కోసం వెళ్లావంటే.. ప్రజాసేవ పైన నీకున్న ఇష్టం ఏంటో అర్థం అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈసారి పవన్ కల్యాణ్ పిఠాపునం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 70 వేలకు పైగా మెజార్టీతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here