Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. రేణు దేశాయ్ పిల్లలకు ఎన్ని కోట్ల ఆస్తులు రాసిచ్చాడో తెలుసా ?

- Advertisement -

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఈ పేరుతో ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆ పేరు వింటే చాలు ఆయన ఫ్యాన్స్ పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు. చేసిన కొన్ని సినిమాలతోనే జనాల్లో ఓ ట్రెండ్ సృష్టించిన లెజెండరీ యాక్టర్. తన యాక్టింగ్ తో జనాల్లో క్రేజ్ తెచ్చుకుని ప్రజలకు సేవ చేయాలన్న భావనతో రాజకీయాల్లోకి అరంగేట్రం చేశాడు. జనసేన అనే పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా పోటీ చేశారు. ఎలాగైనా విజయం సాధించాలని పవన్ ఈ సారి గట్టిగానే ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. జనసైనికులు కూడా పవన్ గెలుపు కోసం ఎంతో శ్రమించారు. వచ్చే నెల జూన్ 4న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇకపోతే ఆయన ఎన్నికల వేళ పవన్ కళ్యాణ్ ఓ మీడియా ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. తన రెండో భార్య రేణుదేశాయ్, పిల్లలు అకీరా-ఆద్యల గురించి ఎదురైన ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ సమాధానమిచ్చారు. ‘నా పిల్లలను అర్బన్ ఏరియాలో ఉండే సగటు ఉద్యోగి ఎలా పెంచుతాడో అలాగే పెంచాను. వారికి కూడా నేను చెప్పింది ఇదే.. చదవుకి సంబంధించిన ఖర్చులు భరించగలను. వీలైతే సినిమాలు చేసి ప్రాపర్టీ ఇస్తానని చెప్పాను. అసలు నిజానికి మా మధ్య ఎన్నడూ ఆస్తుల గురించి చర్చ అనేదే రాదు.

- Advertisement -

అకీరా-ఆద్య.. నా భార్య కోసం ఓ ఇల్లు రాసి ఇచ్చాను. మనం ఏం ఎన్ని ఆస్తులు ఇచ్చామన్నది కాదు.. ఎంత నిలబెట్టుకున్నామన్నదే ముఖ్యం. మాకు కూడా మా నాన్న ఏం ఇవ్వలేదు. మా అన్న నాకు స్కిల్స్ నేర్పించారు. నా పిల్లలకు నేను, వాళ్ల కాళ్ల మీద వారు నిలబడేందుకు సరిపడా ఎడ్యుకేషన్ అందించాను’ అంటూ వన్ కల్యాణ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ఇది గమనించిన పవన్ కల్యాణ్ ఫ్యాన్స్.. ఆయనపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇక ఇటీవల రేణుదేశాయ్ మనీ లేవంటూ ఓ వీడియో చేసిన విషయం తెలిసిందే. దీనికి ధీటుగా పవన్ కల్యాణ్ ఇచ్చిపడేశాడంటూ అభిమానులు ఓ రేంజ్ లో రెచ్చిపోతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here