పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా రీమేక్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. రీ ఎంట్రీలో ఇప్పటివరకు పవన్ చేసిన మూడు సినిమాలు రీమేక్సే కావడం విశేషం. అందులో ముందుగా వచ్చిన వకీల్ సాబ్ హిందీ పింక్ రీమేక్ కాగా, భీమ్లా నాయక్ మళయాళ ఆయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ గా వచ్చింది. ఇక తాజాగా వచ్చిన బ్రో సినిమా కూడా తమిళ హిట్ మూవీ వినోదయ సితం నుండి రీమేక్ చేసిందే.
ప్రస్తతం ఈ సినిమా థియేటర్స్ లో సందడి చేస్తోంది. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ మరో రీమేక్ సినిమాకు రెడీ అవుతున్నారట. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ ఓ మై గాడ్2(OMG2). 2012లో వచ్చిన ఓ మై గాడ్(OMG) సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఆగస్టు 11న ఓ మై గాడ్2 ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఓ మై గాడ్ సినిమాను పవన్ కళ్యాణ్, వెంకటేష్ కాంబోలో గోపాలా గోపాల పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమాలో పవన్ గోపాలునిగా భగవంతుని రూపంలో కనిపంచారు.
ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఓ మై గాడ్2 సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఒకవేళ ఈ సినిమా కూడా హిట్ అయితే.. పవన్ కు మరో రీమేక్ రెడీ అయినట్టే అనే వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని కుదిరి ఈ రీమేక్ పట్టాలెక్కితే.. పవన్ మరోసారి దేవుడిగా దర్శనమివ్వనున్నాడు. మరి ఈ సినిమా రీమేక్ చేయడానికి పవన్ ఒప్పుకుంటాడా లేదా అనేది తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఇప్పటికే రెండు సినిమాల్లో దేవుడిగా కనిపించిన పవన్ కల్యాణ్ మరోసారి ఈ క్రేజీ పాత్రలో కనిపిస్తాడని తెలిసి ఆయన ఫ్యాన్స్ తెగ ఖుషీ అవుతున్నారు. ఇదే నిజమైతే ఈసారి పవన్ కల్యాణ్ శివుడిగా కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.