Pawan Kalyan : అక్టోబర్ నుండి ‘ఓజీ’ తో పవన్ కళ్యాణ్ బిజీ..విడుదల తేదీ కూడా ఖరారు!

- Advertisement -

Pawan Kalyan పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా ఎంత బిజీ గా గడుపుతున్నాడో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ప్రతీ రోజు రివ్యూ మీటింగ్స్, ప్రజల కష్టాలకు సంబంధించిన అర్జీలు తీసుకొని వాటిని పరిష్కరించడం, ఇలాంటి కార్యక్రమాలు ఆయన నిత్యం చేస్తూనే ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి, ఈ చిత్రాలను ఎప్పుడు పూర్తి చేస్తారు అనే సందేహాలు అభిమానుల్లో ఉన్నాయి. గెలిచినా నెల రోజుల తర్వాత పిఠాపురం కి వెళ్లిన పవన్ కళ్యాణ్ , అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అభిమానులు ఓజీ ఎప్పుడు అని అడగగా, ముందు నన్ను ప్రజాసేవ చేసుకోనివ్వండి, ఒక్క మూడు నెలల తర్వాత సమయం చూసుకొని డేట్స్ ఇస్తాను, ఓజీ చూద్దురు గానీ బాగుంటది అని అన్నాడు.

Pawan Kalyan
Pawan Kalyan

చెప్పిన మాట ప్రకారమే ఆయన ఓజీ చిత్రానికి అక్టోబర్ నెల నుండి డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలే ఆ చిత్ర నిర్మాత డీవీవీ దానయ్య పవన్ కళ్యాణ్ ని కలిసి డేట్స్ గురించి చర్చలు జరిపాడట. నెలరోజుల పాటు నాన్ స్టాప్ గా పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి . కొత్త షెడ్యూల్ కాకినాడ పోర్ట్ లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ చిత్రాన్ని మార్చి 28 వ తారీఖున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.

OG: ఆరేళ్ల త‌ర్వాత‌.. చాలు సామీ చాలు..!

- Advertisement -

అలాగే సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా నుండి టీజర్, లేదా మొదటి లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారట. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రం తో పాటుగా పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సత్వరమే పూర్తి చేసే ఆలోచనలో ఉన్నాడట. ఈ ఏడాది లో ఒక చిన్న షెడ్యూల్ ని పూర్తి చేసి, వచ్చే ఏడాది పూర్తి స్థాయి సమయాన్ని కేటాయించి ఈ చిత్రాన్ని కూడా పూర్తి చేస్తాడట. అలాగే హరిహరవీరమల్లు చిత్రం కూడా పూర్తి చెయ్యాల్సి ఉంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఓజీ చిత్రాన్ని ముందుగా పూర్తి చెయ్యాలని పవన్ కళ్యాణ్ పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తుంది.

First Look Of Pawan Kalyan's OG, Released On His 52nd Birthday, Sets This Record - News18

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here