పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ అత్యంత భారీ అంచనాల నడుమ విడుదలకైనా సినిమా ‘జానీ’. ఈ చిత్రానికి ముందుకు ఆయన హీరో గా నటించిన ‘సుస్వాగతం’, ‘తొలిప్రేమ ‘, ‘తమ్ముడు’,’బద్రి’ మరియు ‘ఖుషి’ చిత్రాలు ఒక దానిని మించి ఒకటి హిట్ అయ్యాయి. అలా యూత్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ మూవీ పై అభిమానుల్లో ఆ రేంజ్ అంచనాలు ఏర్పడ్డాయి.

దానికి తోడు రచన, దర్శకత్వం కూడా పవన్ కళ్యాణ్ అవ్వడం అనేది ఈ చిత్రం పై అంచనాలు పెరగడానికి ఒక కారణం అని చెప్పొచ్చు. అలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా, మొదటి ఆట నుండే ఘోరమైన డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. అప్పటి ఆడియన్స్ కి ఏమాత్రం అర్థం కాకపోవడం వల్లే ఈ సినిమా ఆ రేంజ్ లో ఫ్లాప్ అవ్వడానికి కారణం అని అంటారు విశ్లేషకులు.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా మార్చి నెలలోనే విడుదల కావాల్సి ఉంది, కానీ మార్చి 24 వ తేదీన ఇండియా ప్రపంచ కప్ ఫైనల్స్ ఆడబోతుండడం తో ఆయన ఈ సినిమాని వాయిదా వేసాడు. అయితే అప్పట్లో ప్రపంచ కప్ కి స్పాన్సర్ షిప్ చేసే బ్రాండ్స్ లో పెప్సీ కూల్ డ్రింక్స్ సంస్థ కూడా ఉంది. అప్పట్లో పెప్సీ కి బ్రాండ్ అంబాసిడర్ గా పవన్ కళ్యాణ్ వ్యవహరించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆరోజుల్లో పవన్ కళ్యాణ్ చేసిన ఈ పెప్సీ యాడ్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అయితే పెప్సీ అద్వర్యం లో హైదరాబాద్ లో ఒక రోజు ప్రపంచ కప్ సందర్శనార్థం ఉంచారు.

అప్పుడు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేసి, ప్రపంచ కప్ ని ముద్దాడడం అప్పట్లో సెన్సేషన్ గా మారింది. అయితే ఈ ప్రపంచ కప్ ని ఇండియా ఓడిపోయింది, ఈ ప్రపంచ కప్ జరిగిన మరుసటి రోజే జానీ మూవీ ఆడియో ఫంక్షన్ జరిగింది. పక్క నెలలో సినిమా విడుదలైంది, అలా జానీ కూడా ఫ్లాప్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి అప్పట్లో శని పట్టి పీడించాడని, ఆయన ప్రపంచ కప్ ని ముట్టుకోవడం వల్లే ఇండియా వరల్డ్ కప్ ఓడిపోయింది అంటూ అప్పట్లో కొంతమంది పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేసారు.
