పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మామూలుగా కనిపిస్తేనే థియేటర్స్ షేక్ అవుతుంటాయి. అలాంటిది మన దర్శక నిర్మాతలు ఆయనని సరికొత్త కోణం లో చూపిస్తే థియేటర్స్ ఊగిపోతాది అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. కెరీర్ ప్రారంభం లో పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రం లో చొక్కా విప్పి వర్కౌట్స్ చేసినట్టు ఒక రేంజ్ లో చూపిస్తాడు డైరెక్టర్. అప్పట్లో ఆయన చొక్కా విప్పితే యూత్ మొత్తం పిచ్చెక్కిపోయారు, ఆ పాట అప్పట్లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది.

సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ ఏ చిత్రం లో కూడా చొక్కా లేకుండా కనిపించలేదు. ఇప్పుడు ఆయన ‘#OG ‘ చిత్రం లో మరోసారి చొక్కా లేకుండా కనిపించబోతున్నాడు. అది కూడా మామూలు రేంజ్ లో కాదు, సిక్స్ ప్యాక్ బాడీ తో దర్శనం ఇవ్వబోతున్నాడట. దానికి సంబంధించిన ఫోటో ఇదే అంటూ సోషల్ మీడియా లో ప్రచారం సాగుతుంది.

శరీరం నిండా టాటూలతో ఉన్న ఈ ఫోటో పవన్ కళ్యాణ్ కి సంబంధించినదే అని సోషల్ మీడియా లో ఒక రూమర్ ప్రచారం అవుతుంది. మేడలో ఉన్న తాయత్తు మరియు సన్నని గెడ్డం చూస్తుంటే అది పవన్ కళ్యాణ్ లాగానే అనిపిస్తుంది కానీ, అయన శరీరం మీద ఎక్కువగా జుట్టు ఉంటుంది, కానీ ఇక్కడ అది లేదు. అదొక్కటే ఫ్యాన్స్ కి అనుమానం కలిగిస్తున్న విషయం. కానీ అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ #OG చిత్రం లో చొక్కా లేకుండా కొన్ని షాట్స్ లో నటించాడు అనే విషయం నిజమేనట.

దానికి సంబంధించిన ఫోటోలు డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ ఆఫీస్ లో ఉన్నాయి. ఫస్ట్ లుక్ గా ఈ స్టిల్ విడుదల అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయట. సోషల్ మీడియా లో లీక్ అయినా ఫోటో పవన్ కళ్యాణ్ కి సంబంధించిందా కాదా అనే విషయం పక్కన పెడితే, #OG చిత్రం లో మాత్రం ఆయన షర్ట్ లేకుండా కనిపిస్తాడని మాత్రం అర్థం అయ్యింది. ఇక ఫ్యాన్స్ దీనికి ఏ రేంజ్ లో ఊగిపోతారో ఊహించుకోవచ్చు.
