పవర్ స్టార్ Pawan Kalyan గత కొద్దీ రోజుల క్రితమే ఇంస్టాగ్రామ్ లోకి అదిగపెట్టిన సంగతి అందరికీ తెలుసిందే. ఇంస్టాగ్రామ్ లోకి వచ్చినప్పటికీ ఇన్ని రోజులు ఆయన నుండి ఒక్క పోస్ట్ కూడా పడలేదు. అయ్యినప్పటికీ కూడా 24 లక్షల మంది పవన్ కళ్యాణ్ ని ఫాలో అయ్యారు. ఒక్క పోస్ట్ కూడా వెయ్యకుండా ఈ రేంజ్ ఫాలోయర్స్ ని తెచ్చుకున్న సెలబ్రిటీ ఇండియా లోనే కాదు, ప్రపంచం లో కూడా ఎక్కడ లేరు.

ఆ ఘనత ఒక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కింది. మొదటి రోజే ఈయనకి 17 లక్షల మంది ఫాలోయర్స్ వచ్చారు. ఇది టాలీవుడ్ లోనే ఆల్ టైం రికార్డు గా చెప్పుకోవచ్చు. ఇక నేడు కాసేపటి క్రితమే ఆయన ఒక ఇంస్టాగ్రామ్ లో తన మొట్టమొదటి రీల్ ని అప్లోడ్ చేసాడు. దీనికి ఫ్యాన్స్ అద్భుతమైన రీచ్ వచ్చింది.

ఆయన ఈ పోస్ట్ అప్లోడ్ చేసిన 10 నిమిషాల్లోపే లక్షకు పైగా లైక్స్ వచ్చాయి. అదే రేంజ్ స్పీడ్ ని కొనసాగుతూ వెళ్ళింది. చివరికి మొదటి గంటలో ఈ రీల్ కి 1 మిలియన్ కి పైగా వ్యూస్ , నాలుగు లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ఈ రీల్ లో పవన్ కళ్యాణ్ తన మధుర జ్ఞాపకాలను పొందుపరిచాడు. తన తోటి హీరోలతో , హీరోయిన్లతో మరియు నటీనటులతో కలిసి దిగిన ఫోటోలను ఆయన అప్లోడ్ చేసాడు.

ముఖ్యంగా ‘హరి హర వీరమల్లు’ లొకేషన్ లో రాజమౌళి , రవితేజ వంటి వారు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలను అప్లోడ్ చెయ్యగా , అభిమానులు దానిని సోషల్ మీడియా లో షేర్ చేసి ఎంతగానో మురిసిపోతున్నారు. మా హీరో ఈ సినిమాలో మెరిసిపోతున్నాడు , ఈ చిత్రం ఎప్పుడొచ్చినా బాక్స్ ఆఫీస్ బద్దలే అంటూ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటున్నారు. ఇక పోస్ట్ ఈ రీల్ కి 1 మిలియన్ లైక్స్ రావడానికి ఎంత సమయం పడుతుందో చూడాలి.