పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య పాత్రలో నటించిన ‘బ్రో ది అవతార్’ చిత్రం ఈమధ్యనే ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై డివైడ్ టాక్ ని సొంతం చేసుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. పవన్ కళ్యాణ్ రేంజ్ సినిమా కాదని, ఈ సినిమా ఆయన ఒప్పుకోకుండా ఉండాల్సింది అంటూ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్ చేసారు.

కానీ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ కారణంగా ఈ సినిమా అద్భుతమైన ఓపెనింగ్ వీకెండ్ ని సొంతం చేసుకుంది. ఎక్కడ చూసినా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో అసలు ఈ సినిమా కి నిజంగా డివైడ్ టాక్ వచ్చిందా అని ట్రేడ్ పండితులు సైతం కాసేపు అనుమానం పడేలా చేసింది ఈ సినిమా. అదంతా పవన్ కళ్యాణ్ మ్యాజిక్, అయితే మొదటి వీకెండ్ పూర్తి అవ్వగానే సోమవారం నాడు వసూళ్లు దారుణంగా పడిపోయాయి.

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ సినిమాకి ఆదివారం తో పోలిస్తే సోమవారం వసూళ్లు 70 శాతం తగ్గిపోయాయి. నాల్గవ రోజు కేవలం రెండు కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టింది. దీనితో అభిమానులకు చిర్రెత్తిపోయి త్రివిక్రమ్ పై తమకి ఉన్న కోపాన్ని మొత్తం వెళ్లగక్కుతూ ట్విట్టర్ లో ఒక స్పేస్ పెట్టారు. త్రివిక్రమ్ ని చాలా పచ్చిగా తిడుతూ ఫ్యాన్స్ పెట్టిన ఆ స్పేస్ ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఏ రేంజ్ లో అంటే నేరుగా మూవీ టీం కి రీచ్ అయ్యేంతలా అన్నమాట.

నిన్న సాయంత్రం ఆ చిత్ర సంగీత దర్శకుడు థమన్ కూడా రెస్పాండ్ అయ్యి త్రివిక్రమ్ పై పాజిటివ్ ట్వీట్స్ వెయ్యడం, ఆ తర్వాత ఆయన మీద ఈ ఆదివారం స్పేస్ పెట్టి పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ స్నేహం ఎంతో గొప్పదో వివరిస్తాను అని చెప్పడం, ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే ‘బ్రో ది అవతార్’ 5 రోజు వసూళ్లు, నాల్గవ రోజుతో పోలిస్తే పెద్దగా తగ్గలేదని, డీసెంట్ హోల్డ్ ని సొంతం చేసుకుందని. ఐదవ రోజు కూడా ఈ సినిమాకి రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయని చెప్తున్నారు.