National Awards 2023 : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి నిన్న ఢిల్లీలోని విగ్యాన్ భవన్ లో గవర్నర్ గారి చేతుల మీదుగా నేషనల్ అవార్డు ని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. 90 ఏళ్ళ తెలుగు సినీ చరిత్ర లో జాతీయ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి హీరో అల్లు అర్జున్ మాత్రమే.ఆయన అభిమానులకు ఇది ఎంత గర్వంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. #RRR చిత్రానికి ఆస్కార్ అవార్డ్స్ వచ్చిన తర్వాత మన తెలుగు సినిమా స్థాయి బాగా పెరిగింది.
అందుకే అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు రావడం సులువు అయ్యింది. భవిష్యత్తులో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోలకు కూడా నేషనల్ అవార్డ్స్ రావొచ్చు. కానీ అల్లు అర్జున్ మాత్రం జాతీయ పురస్కారం అందుకున్న మొట్టమొదటి తెలుగు హీరో గా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాడు. భవిష్యత్తులో జరగబోయే కాంపిటీటివ్ పరీక్షలలో దీని గురించి ప్రశ్నలు కూడా రావొచ్చు.
ఇది ఇలా ఉండగా విగ్యాన్ భవన్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జున్ మాత్రమే అని ఆయన అభిమానులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సమాధానం చెప్తూ, పవన్ కళ్యాణ్ 2020 వ సంవత్సరం లోనే ఇక్కడ విద్యార్థులను ఉత్తేజ పరిచే అద్భుతమైన ప్రసంగం ఇచ్చాడని అప్పటి స్పీచ్ తాలూకు వీడియోస్ ని అప్లోడ్ చేసాడు. ఆ విధంగా విగ్యాన్ భవన్ లోకి అడుగుపెట్టిన మొట్టమొదటి తెలుగోడుగా పవన్ కళ్యాణ్ నిలిచాడని అంటున్నారు.
ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సెమినార్ ప్రోగ్రాం కి ముఖ్య అతిథిగా పాల్గొన్న పవన్ కళ్యాణ్, ఆరోజు విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపే విధంగా ఇచ్చిన ప్రసంగం అప్పట్లో సెన్సేషన్ అయ్యింది. అంతే కాదు హార్వార్డ్ యూనివర్సిటీ లో ప్రసంగం ఇచ్చిన మొట్టమొదటి తెలుగోడిగా కూడా పవన్ కళ్యాణ్ చరిత్ర సృష్టించాడు. రాబొయ్యే రోజుల్లో ఆయన కూడా అల్లు అర్జున్ లాగ ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకునే అదృష్టం దక్కించుకుంటాడో లేదో చూడాలి.