Pawan Kalyan : టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ మిస్ అయ్యినటువంటి క్రేజీ ప్రాజెక్ట్స్ ఇప్పటి వరకు ఏ స్టార్ హీరో కూడా మిస్ అయ్యి ఉండదు. ఆయన వదులుకున్న సినిమాలు సదరు స్టార్ హీరోల కెరీర్ ని పీక్ రేంజ్ కి తీసుకెళ్లింది. ఆ స్టార్ హీరోలు ఎవరో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే పవన్ కళ్యాణ్ మరియు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే కాంబినేషన్ లో ఒక క్రేజీ సినిమా మిస్ అయ్యిందని అప్పట్లో ఒక టాక్ నడిచింది.
ఆరోజుల్లో బాలీవుడ్ ని అమిర్ ఖాన్ హీరో గా నటించిన ‘3 ఇడియట్స్’ అనే చిత్రం ఒక ఊపు ఊపింది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లోనే 300 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది అంటే ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ హిట్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఈ సినిమాని సౌత్ లో శంకర్ ‘విజయ్’ తో రీమేక్ చేసాడు. ఆశించిన స్థాయిలో ఈ చిత్రం ఆడలేదు. అయితే విజయ్ కంటే ముందు ఈ సినిమాని సౌత్ లో మహేష్ బాబు తో, లేదా పవన్ కళ్యాణ్ తో చెయ్యాలని శంకర్ అనుకున్నాడు. మహేష్ బాబు రీమేక్ సినిమాలు చెయ్యడం నా వల్ల కాదు అని ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేసాడు. ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వద్దకి వెళ్లి స్టోరీ ని వినిపించగా, ఆయన వెంటనే ఓకే చెప్పేసాడు.
కానీ అమీర్ ఖాన్ ఆ రేంజ్ లో నటించిన తర్వాత తన నటనతో పోల్చి చూస్తారు కాబట్టి, సినిమా ఫలితం తేడా అయ్యే అవకాశం ఉంది కదా అని తన భయాన్ని వ్యక్తపరిచాడు పవన్ కళ్యాణ్. అదేమీ లేదు, నువ్వు చెయ్యగలవ్ అని ఒప్పించి ఈ ప్రాజెక్ట్ కి హీరోయిన్ గా దీపికా పదుకొనే ని కూడా తీసుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ కి ధైర్యం సరిపోక ఈ రీమేక్ చెయ్యలేను అండీ అని రిజెక్ట్ చేసాడట. దాంతో ఈ క్రేజీ కాంబినేషన్ మిస్ అయ్యింది.